ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు రూ 1.8 లక్షల కోట్లకు అధిపతి.. జౌ కున్‌ఫీ సక్సెస్‌ స్టోరీ!

ఒకప్పుడు రోజుకు వంద సంపాదించే సాధారణ ఫ్యాక్టరీ కార్మికురాలు. చదువును మధ్యలో ఆపేసి పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరింది. కష్టపడే తత్వం, సాధించాలనే పట్టుదల ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఇప్పుడు రూ.1.8 లక్షల కోట్లకు పైగా సంపదతో చైనాలో నంబర్ వన్ కుబేరురాలు! ఫ్యాక్టరీ కార్మికురాలి నుంచి కుబేరురాలిగా.. జౌ కున్‌ఫీ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు రూ 1.8 లక్షల కోట్లకు అధిపతి.. జౌ కున్‌ఫీ సక్సెస్‌ స్టోరీ!
Zhou Qunfei Who Was Once A Factory Worker Is Now Chinas Richest Woman

Updated on: Nov 03, 2026 | 12:03 AM

ఒకప్పుడు రోజుకు వంద సంపాదించే సాధారణ ఫ్యాక్టరీ కార్మికురాలు. చదువును మధ్యలో ఆపేసి పొట్టకూటి కోసం ఉద్యోగంలో చేరింది. కష్టపడే తత్వం, సాధించాలనే పట్టుదల ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఇప్పుడు రూ.1.8 లక్షల కోట్లకు పైగా సంపదతో చైనాలో నంబర్ వన్ కుబేరురాలు! ఫ్యాక్టరీ కార్మికురాలి నుంచి కుబేరురాలిగా.. జౌ కున్‌ఫీ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

23 ఏళ్లకే సొంత వ్యాపారం ప్రారంభం

హునన్ ప్రావిన్స్ లో 1970లో జన్మించిన జౌ కున్‌ఫీ టీనేజ్‌లో చదువును  ఆపేసి ఉద్యోగం కోసం షెన్‌జెన్ నగరానికి వెళ్లి వాచ్ గ్లాస్ తయారీ ఫ్యాక్టరీలో రోజుకు వంద రూపాయల వేతనంతో కూలీగా చేరింది.  23 ఏళ్ల వయసులో సొంతంగా గ్లాస్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించి గ్లాస్‌ పై స్క్రీన్ ప్రింటింగ్, వంపు ఆకారంలో గ్లాస్‌ తయారీ టెక్నిక్ నేర్చుకుంది. ఈ నైపుణ్యాలే ఆమె వ్యాపార విజయానికి పునాదిగా మారాయి.  లెన్స్ టెక్నాలజీ (Lens Technology) గ్లాస్ తయారీ సంస్థను స్థాపించి స్మార్ట్ ఫోన్లకు స్క్రీన్లు సప్లై చేసింది.

ఐఫోన్‌తో మారిన కంపెనీ తలరాత

2007లో యాపిల్ తొలి ఐఫోన్‌ లకు గ్లాస్ కవర్లు సప్లై చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి జౌ కున్‌ఫీ కంపెనీ లాభాల బాట పట్టింది.  ఐఫోన్లకు అవసరమైన గ్లాస్ స్క్రీన్ కవర్లను లెన్స్ టెక్నాలజీ సరఫరా చేసింది. 2011 నుంచి 2014 మధ్య కంపెనీ ఐఫోన్ లకు గ్లాస్ సేల్స్ తో ఊహించని లాభాలను సొంతం చేసుకుంది. 2015లో షెన్‌జెన్ స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లను లిస్ట్ చేయడంతో జౌ కున్‌ఫీ సంపద పెరిగింది. అదే ఏడాది చైనాలో అత్యంత ధనవంతురాలిగా గుర్తింపు కూడా పొందారు.

వాణిజ్య యుద్ధంతో ఎదురుదెబ్బ

2018లో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, యాపిల్ అమ్మకాలపై ఆందోళనలు లెన్స్ టెక్నాలజీ షేర్లపై ప్రభావం చూపాయి. కంపెనీ షేర్ ధర పడిపోయింది.  దాంతో జౌ కున్‌ఫీ  స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు సంబంధించిన హార్డ్‌వేర్, రోబోటిక్స్ రంగాల్లోకి కంపెనీని విస్తరించారు. లెన్స్ టెక్నాలజీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ గ్లాస్ తయారీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ రంగాల్లోనూ విస్తరించింది.

రూ.1.8 లక్షల కోట్ల సంపద.. మళ్లీ నంబర్ వన్!

హురున్ విడుదల చేసిన 2026 అత్యంత ధనవంతుల మహిళల జాబితాలో 56 ఏళ్ల జౌ కున్‌ఫీ సంపద 127 బిలియన్ యువాన్లకు చేరింది. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 1.8 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 15 శాతం పెరిగింది. హాన్సో ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకురాలు ఝోంగ్ హుయిజువాన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు జౌ కున్‌ఫీ.

స్వయంకృషితో ఎదిగిన మహిళా బిలియనీర్లు

 

హురున్ నివేదిక ప్రకారం, చైనాలో అత్యంత ధనవంతులైన 50 మంది మహిళల్లో 65 శాతం మంది స్వయంకృషితో సంపన్నులుగా ఎదిగినవారే. వీరి సంపద 1.93 ట్రిలియన్ యువాన్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. జౌ కున్‌ఫీ, ఆమె భర్త  హురున్ సంపన్నుల జాబితాలో 33వ స్థానంలో నిలిచారు.  ఈ జాబితాలో బైట్‌డ్యాన్స్ (ByteDance) వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ 670 బిలియన్ యువాన్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us