Viral Video: ఓ పదినెలల చిన్నారి పాన్ కేక్ తింటున్న సమయంలో .. అది గొంతులో అడ్డంపడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే.. రెస్టారెంట్ లోనే ఉన్న ఓ వ్యక్తి స్పందించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. లైఫ్ వాక్ అనే పరికరాన్ని ఉపయోగించి చిన్నారి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ కరోలినాలోని ఓ రెస్టారెంట్లో చోటు చేసుకుంది. రెస్టారెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ముమ్ జైన్ కోహ్లర్ తన భర్త పది నెలల బాలుడితో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్ళింది, అక్కడ 10 నెలల చిన్నారి గాబ్రియేల్ కు పాన్ కేక్ పెట్టడంలో.. అది ఆ బాలుడు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే.. వెంటనే తల్లి ఆ బాలుడు వీపుని తట్టడం మొదలు పెట్టింది. అది చూసిన ముమ్ జైన్ కోహ్లర్ వెంటనే తాను కూడా ఆ చిన్నారికి ప్రధమ చికిత్స అందించడానికి ప్రయత్నించాడు. అప్పటికే బాబు నీలం రంగులోకి మారడం మొదలు పెట్టాడు. దీంతో ముమ్ జైన్ కోహ్లర్ ఎవరైనా వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయమని వేడుకుంది. తన బాబుని బతికించడానికి ఎవరైనా సహాయం చేయమంటూ తల్లి అర్ధించింది.
అది చూసి రెస్టారెంట్ లోని వారందరూ చిన్నారి దగ్గరకు చేరుకోగా.. రెస్టారెంట్ లో ఉన్న మేజర్ హిల్లార్డ్ అనే వ్యక్తి వెంటనే బయకు పరిగెత్తి… లైఫ్ వాక్ (గాలి పీడనం కలిగించి శుబ్రపరిచే ఒక చిన్న వస్తువు) ని తీసుకుని వచ్చాడు. అనంతరం గాబ్రియేల్ దగ్గరకు వచ్చిన మేజర్ హిల్లార్డ్ ఆ లైఫ్ వాక్ ని నోటి దగ్గర పెట్టి.. ఊరిపీలుచుకోవడానికి అడ్డంగా ఉన్న పాన్ కేక్ ముక్కని బయటకు తీశాడు. అనంతరం ఆ చిన్నారి ఊపిరి పీల్చుకోవడం మొదలు పెట్టాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులతో పాటు.. మిగిలిన వ్యక్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదే విషయంపై హిల్లార్డ్ స్పందిస్తూ.. తన దగ్గర ఈ లైఫ్ వాక్ డివైజ్ దాదాపు తన కారులో ఐదేళ్ల నుంచి ఉందని.. ఇప్పటి వరకూ దీని అవసరం రాలేదని అన్నారు. అయితే ఇప్పుడు చిన్నారి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడినందుకు తనకు సంతోషంగా ఉందని అన్నాడు. హిల్లార్డ్ సమయస్ఫూర్తి పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: