కాకే… కానీ.. పిల్ల గొరిల్లాలా .. నేచర్లో విచిత్రం !

జపాన్ లోని నగోయా ప్రాంతానికి వెళ్తే.. అక్కడో విచిత్రమైన ప్రాణి కనిపిస్తుంది. మరి.. అది కాకిలా కనిపించినా.. అలా లేకుండా.. ఓ పిల్ల గొరిల్లాలా కనిపించడమే విశేషం. ఓ ఇంటి ప్రాంగణంలో వాలిన అది అందర్నీ ఆశ్చర్యపరిచింది. బహుశా కాకి జాతిలో ఇదో కొత్త ‘ జంతువై ‘ ఉండవచ్ఛునని కొంతమంది అభిప్రాయపడితే.. వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం ఇది కాకి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదని, ఈ పక్షి తన కాళ్ళను, రెక్కలను ఒకే […]

కాకే... కానీ.. పిల్ల గొరిల్లాలా .. నేచర్లో విచిత్రం !
Follow us

|

Updated on: Jun 25, 2019 | 2:27 PM

జపాన్ లోని నగోయా ప్రాంతానికి వెళ్తే.. అక్కడో విచిత్రమైన ప్రాణి కనిపిస్తుంది. మరి.. అది కాకిలా కనిపించినా.. అలా లేకుండా.. ఓ పిల్ల గొరిల్లాలా కనిపించడమే విశేషం. ఓ ఇంటి ప్రాంగణంలో వాలిన అది అందర్నీ ఆశ్చర్యపరిచింది. బహుశా కాకి జాతిలో ఇదో కొత్త ‘ జంతువై ‘ ఉండవచ్ఛునని కొంతమంది అభిప్రాయపడితే.. వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం ఇది కాకి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదని, ఈ పక్షి తన కాళ్ళను, రెక్కలను ఒకే చోట చేర్చినప్పుడు ఇలా కనబడిందని అంటున్నారు. అంతేకాదు.. ఈ పక్షి తల కూడా వైవిధ్యంగా ఉందని, దీని ప్రపోర్షన్ హెడ్ యూనిట్ విశాలంగా ఉండడం కూడా చిన్న సైజు గొరిల్లా మాదిరి కనబడడానికి కారణమైందని వారు విశ్లేషించారు. ఏమైనా.. కిటారో సింప్సన్ అనే ట్విటర్ యూజర్.. ఈ ‘ కాకి ‘ కాని ‘ కాకి ‘ గారి వైనాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేయడంతో ఒక్కసారిగా 90 లక్షల వ్యూస్ వఛ్చి పడ్డాయి. ఇలాంటి పక్షిని తామెప్పుడూ చూడలేదని, ప్రకృతిలో ఇదో వింత జీవి అని అనని వాళ్ళు లేరు. ఈ వీడియోను వేలాదిమంది షేర్ చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో.. ఇది ఎగరలేని పక్షి అని, కొంతమంది కావాలనే … ఓ కాకిని ఇలా దాదాపు ‘ షేపు ‘ మార్చి చూపుతున్నారని ఎద్దేవా చేసినప్పటికీ.. దీని వీడియో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చెండాడేస్తోంది.

Latest Articles