కోట్ల మంది ప్రాణాలు కాపాడగల టాయిలెట్ సీటు

టాయిలెట్ సీటే మన డాక్టర్ ఒక టాయిలెట్ సీటు లక్షల మంది ప్రాణాలు కాపాడగలదు. గుండెకు సంబంధించిన రోగాలను ముందుగా గుర్తించి మనలను జగ్రత్తపరచగలదు. బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్స్.. ఇలా మనకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాబోయే ప్రమాదాలను ముందుగా తెలియజేస్తుంది. మనం నిత్యం ఉపయోగించే టాయిలెట్‌ సీటుకు పైభాగాన ఒక ఎలక్ట్రానిక్ పరికరం అమర్చబడి ఉంటుంది. అది హార్ట్ బీట్‌ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. రక్తపోటు, రక్తంలో […]

  • Publish Date - 1:17 pm, Fri, 22 March 19
కోట్ల మంది ప్రాణాలు కాపాడగల టాయిలెట్ సీటు
  • టాయిలెట్ సీటే మన డాక్టర్

ఒక టాయిలెట్ సీటు లక్షల మంది ప్రాణాలు కాపాడగలదు. గుండెకు సంబంధించిన రోగాలను ముందుగా గుర్తించి మనలను జగ్రత్తపరచగలదు. బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్స్.. ఇలా మనకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాబోయే ప్రమాదాలను ముందుగా తెలియజేస్తుంది.

మనం నిత్యం ఉపయోగించే టాయిలెట్‌ సీటుకు పైభాగాన ఒక ఎలక్ట్రానిక్ పరికరం అమర్చబడి ఉంటుంది. అది హార్ట్ బీట్‌ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. రక్తపోటు, రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవల్స్‌ను నమోదు చేస్తుంది. దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ దీని వల్ల గుండె వ్యాదులను తేలికగా నయం చేసుకోవచ్చని చెబుతున్నారు.

మనకు వ్యాధి లక్షణాలు బయటకు తెలియడానికన్నా చాలా ముందుగానే వాటి గురించి మనకు ఈ టాయిలెట్ సీటు తెలియజేస్తుంది. ప్రస్తుతం దాని ఖరీదు లక్షా 35 వేల రూపాయలు. కాస్త ఎక్కువ ఖరీదే కానీ దీని వల్ల మనం ఆస్పత్రికి పెట్టే ఖర్చులు బాగా తగ్గుతాయి.

ఈ టాయిలెట్ సీటును న్యూయార్క్‌లో రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందులో అమర్చబడిన సెన్సార్లు మన శరీరాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. అంటే టాయిలెట్ సీటే మనకు డాక్టర్ అన్నమాట.