Special Tourism: సమ్మర్ స్పెషల్ ఆఫర్స్.. తక్కువ బడ్జెట్లో ఈ దేశాలు చుట్టేయొచ్చు..

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్లో ఉన్న ఎయిర్‎పోర్టులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. భారతీయులకు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం పెరగడం ఆర్థిక వెసులుబాటు ఉండడంతో.. లగ్జరీ టూర్లకు ఈజీగా వెళుతున్నారు. అయితే ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు కూడా విదేశాలకు హ్యాపీగా వెళ్లి రావొచ్చు.

Special Tourism: సమ్మర్ స్పెషల్ ఆఫర్స్.. తక్కువ బడ్జెట్లో ఈ దేశాలు చుట్టేయొచ్చు..
Summer Special Tour
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 04, 2024 | 4:28 PM

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్లో ఉన్న ఎయిర్‎పోర్టులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. భారతీయులకు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం పెరగడం ఆర్థిక వెసులుబాటు ఉండడంతో.. లగ్జరీ టూర్లకు ఈజీగా వెళుతున్నారు. అయితే ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు కూడా విదేశాలకు హ్యాపీగా వెళ్లి రావొచ్చు. కేవలం రూ.25 వేల రూపాయలు ఉంటే ఈ తొమ్మిది దేశాల్లో విహరించి వచ్చేయొచ్చు.

ఎక్కువ ట్రావెల్ ఏజెన్సీలు ప్రిఫర్ చేస్తున్న ట్రిప్ బ్యాంకాక్..

అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్ టికెట్ 20 నుంచి 25 వేల రూపాయలు ఉంటుంది. నెల రెండు నెలల ముందు ప్లాన్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువగా దొరికే అవకాశం ఉంది. 25 వేలకి రానుపోను విమాన చార్జీలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నాయి కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు. అందమైన బీచ్‎లు, ప్రకృతి, బ్యాంకాక్ సిటీ, వాటర్ గేమ్స్, టైగర్ పార్క్, మార్కెట్స్ ఇవి థాయిలాండ్ ప్రత్యేకతలు. బ్యాచులర్స్ కి, కుటుంబాలతో వెళ్లే వాళ్లకు కూడా ఈ దేశం చాలా బాగుంటుంది.

శ్రీలంక..

భారత్ అనుకుని ఉన్న ఓ ద్వీపమైన శ్రీలంక. టూరిస్టులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. టి ఎస్టేట్లు, బీచ్‎లు, ప్రకృతి సౌందర్యం, జలపాతాలు, అభయారణ్యాలు, ప్రాచీన నగరాలతో శ్రీలంక టూర్ ఒక మెమొరబుల్‎గా ఉంటుంది. ఇది కూడా పాతికవేలలోపే పూర్తి చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

నేపాల్:

నేపాల్ కూడా భారత్‎కు పొరుగున ఉన్న దేశం. సింపుల్ బడ్జెట్లో వెళ్లే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. హిమాలయ అందాలను నేపాల్ నుంచి చూస్తే ఆ కిక్కే వేరు. నేపాల్ సంస్కృతి బాగా ఆకట్టుకుంటుంది. అక్కడ దేవాలయాలు, బౌద్ధారామాలు, జూ పార్కులు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నేపాల్‎లో నైట్ క్లబ్స్ కూడా బాగుంటాయి. ఇది కూడా రూ. 25 వేలల్లో మంచి ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు.

వియత్నం:

తీవ్రమైన సంక్షోభం నుంచి కోలుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఆకట్టుకుంటున్న దేశం వియత్నం. హోచిమి సిటీ ఈ దేశంలో ఉన్న మంచి ఆతిథ్య నగరం. ప్రకృతి అందాలు, మంచి స్ట్రీట్ ఫుడ్, చక్కటి వాతావరణం, టూరిస్ట్‎ల కోసం మంచి సదుపాయం ఇది వియత్నాం ప్రత్యేకత. ఇక్కడి చారిత్రక కట్టడాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇది కూడా పాతిక వేల లోపు వెళ్లి రావచ్చు.

సింగపూర్:

అత్యాధునిక దేశం. చాలా చిన్న దేశమైనా టూరిస్టులను చాలా ఆకట్టుకుంటుంది. షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక స్వర్గధామం. చుట్టూ సముద్రం మధ్యలో నగరం.. టెక్నాలజీతో ఆకట్టుకునే సింగపూర్ ఫ్యామిలీ టూర్‎కి మంచి ఆప్షన్. జీవితకాలం అనుభూతిని మిగులుస్తుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్.

దుబాయ్:

ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‎లో ఉన్న టూరిస్ట్ ప్లేస్ దుబాయ్. ఒకటా రెండా చెప్పుకోలేనన్ని అట్రాక్షన్స్ దుబాయ్‎లో ఉన్నాయి. ఇసుక ఎడారి నుంచి ప్రపంచంలో ఎత్తైన భవనం వరకు అన్ని ఇక్కడే.. బుర్చి ఖలీఫా, దుబాయ్ మాల్, ఫోటో ఫ్రేమ్, డిసర్ట్ సఫారీ ఇలా వారం రోజులు ఉన్న సరిపోని టూర్ దుబాయ్‎లో ఉన్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్న దుబాయ్ టూర్ బడ్జెట్లోనే వెయ్యొచ్చు.

మలేషియా:

మలేషియా గురించి చెప్పాలంటే పూర్తిగా బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్. మీ దగ్గరే ఎన్ని డబ్బులు ఉంటే అంతకే అక్కడ వస్తువులు కూడా దొరుకుతాయి. చిన్నచిన్న హోటల్స్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు బడ్జెట్ రేట్స్‎లో ఉంటాయి. ఇక ఫ్లైట్ టికెట్స్ కూడా పోనూ రాను కలిపి రూ.18 నుంచి రూ.20 వేల లోపే అవుతుంది. కోలాలంపూర్ సిటీ ఆకట్టుకుంటుంది. ట్విన్ టవర్స్, స్పైసి స్ట్రీట్ ఫుడ్, రైన్ ఫారెస్ట్, ఐలాండ్స్ ఇలా చాలా ప్రత్యేకతలే మలేషియాలో ఉన్నాయి.

బంగ్లాదేశ్:

ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్లో టూరిజం డెవలప్ అవుతుంది. ఒకప్పుడు భారత్‎లో భాగమైన బంగ్లాదేశ్ అందమైన ప్రదేశాలకు ఫేమస్. బంగ్లాదేశ్ రాజధాని అయిన డాకా సిటీలో స్టే చేయొచ్చు. అక్కడ నుంచి బ్రహ్మపుత్ర నదిలో రివర్ క్రూజ్, సిరణ్ రివర్, జలపాతాలు ఇలా అన్నింటినీ ఎక్స్‎ప్లోర్ చేయొచ్చు. బంగ్లాదేశ్ ఆతిథ్యం చాలా బాగుంటుంది. అక్కడి భోజనం కూడా భారత్ వంటకాలు లాగానే ఇబ్బంది లేకుండా ఉంటాయి. నేచురల్ బ్యూటీ అయిన బంగ్లాదేశ్ విజిట్ కూడా పాతికవేల లోపే అయిపోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?