Viral News: డబ్బు కోసం క్యాన్సర్ నాటకం.. చివరకు ఇంట్లో శవమై తేలిన వివాదాస్పద సింగర్..

కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కాడు. తన ఫ్యాన్స్ నుంచే డబ్బులు దోచుకునేందుకు క్యాన్సర్ నాటకమాడాడు. చివరకు తన సొంత ఇంట్లోనే శవమై తేలాడు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సింగర్ చోయ్ సంగ్ బోంగ్ జీవిత విషాద గాధ ఇది.

Viral News: డబ్బు కోసం క్యాన్సర్ నాటకం.. చివరకు ఇంట్లో శవమై తేలిన వివాదాస్పద సింగర్..
Choi Sung Bong (File Photo)

Updated on: Jun 21, 2023 | 3:44 PM

Korean Singer Choi Sung Bong: కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కాడు. తన ఫ్యాన్స్ నుంచే డబ్బులు దోచుకునేందుకు క్యాన్సర్ నాటకమాడాడు. చివరకు తన సొంత ఇంట్లోనే శవమై తేలాడు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సింగర్ చోయ్ సంగ్ బోంగ్ జీవిత విషాద గాధ ఇది. సియోల్‌కు చెందిన 33 ఏళ్ల చోయ్ సంగ్ బోంగ్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తన యూట్యూబ్ ఛానల్‌లో చివరి సందేశాన్ని పోస్ట్ చేశాడు. సియోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2011లో సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన చోయ్ సంగ్ షార్ట్‌ టైమ్‌లోనూ మంచి ఫేమ్ సాధించాడు. 2014లో అతను విడుదల చేసిన ‘స్లో బాయ్’ అనే ఆల్బమ్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇంతలో తనకు పలు రకాల క్యాన్సర్ సోకిందంటూ చోయ్ సంగ్ చేసిన ప్రకటన.. అతని అభిమానులను షాక్‌కు గురిచేసింది. తనకు క్యాన్సర్ చికిత్స పేరిట అభిమానుల నుంచి కొంత విరాళాలు సేకరించాడు. అయితే కొంతకాలానికే అసలు విషయం బయటపడింది. క్యాన్సర్ బారినపడినట్లు అతను సోషల్ మీడియాలో విడుదల చేసిన మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఫోర్జరీ చేసినవిగా తేలిపోయాయి. దీంతో దక్షిణ కొరియా దేశ ప్రజలు, తమ ప్రాణాలకంటే ఎక్కువగా అభిమానించిన ఫ్యాన్స్ ఆ సింగర్‌ను తిట్టిపోశారు. మరో గత్యంతరం లేక.. తనకు క్యాన్సర్ సోకినట్లు అబద్ధం చెప్పానని అంగీకరిస్తూ చోయ్ క్షమాపణ చెప్పాడు.

ఆ తర్వాతటి కాలంలో ఇండస్ట్రీ నుంచి తగిన ఆదరణ లభించడకపోవడంతో చోయ్ రెస్టారెంట్‌లో పనికి చేరాడు. అయితే తన సింగింగ్ ట్యాలెంట్‌ను ప్రదర్శించేందుకు యూట్యూబ్ ఛానల్ నడిపేవాడు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్‌ కోసం జీవితంలో ఇదే చివరి లేఖ అంటూ.. సూసైడ్ నోట్‌ను ఆ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చోయ్. ఆ సూసైడ్ నోట్‌లో గతంలో తాను చేసిన పెనుతప్పిదానికి మరోసారి క్షమాపణలు చెప్పాడు. గత రెండేళ్లలో తనకు విరాళాలు పంపిన అభిమానులకు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసినట్లు తెలిపాడు. తన పాప పరిహారంగా ప్రాణాలు ఇస్తున్నట్లు ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. చోయ్ బలవన్మరణంతో అతని ఫ్యాన్స్ శోఖసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయస్సులోనే చోయ్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారంటూ అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..