Shocking News: 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాల తయారీ.. రెస్టారెంట్ సీజ్.. ఎక్కడో తెలుసా?..

|

Apr 27, 2022 | 4:07 PM

Viral News: సమోసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, సమోసాల్లో రకాలు ఉంటాయి. ఉల్లిపాయ సమోసోగా,

Shocking News: 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాల తయారీ.. రెస్టారెంట్ సీజ్.. ఎక్కడో తెలుసా?..
Samosa
Follow us on

Viral News: సమోసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, సమోసాల్లో రకాలు ఉంటాయి. ఉల్లిపాయ సమోసోగా, మొక్కజొన్న సమోసా, ఆలు సమోసా ఇలా రకరకాలుగా సమోసాలను తయారు చేస్తారు. వీటి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా టీ తాగితే అక్కడ సమోసా తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, సమోసా తయారీలో కొంతమంది ఏళ్లుగా పనిచేస్తూ నిపుణులు ఉంటారు.

తాజాజగా సౌదీ అరేబియాలో 30 సంవత్సరాలు ఎంతో ప్రాముఖ్యత పొందిన, సమోసాలు, స్నాక్స్ తయారు చేస్తున్న రెస్టారెంట్ను అధికారులు సీజ్ చేశారు. ఆ రెస్టారెంట్ సీజ్ చేయడానికి గల కారణం తెలిసి అందరూ షాక్ అయ్యారు. 30 సంవత్సరాలకు పైగా టాయిలెట్‌లోనే సమోసాలు, స్నాక్స్ చేస్తున్నారని గుర్తించిన అధికారులు.. తక్షణమే ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. జెడ్డా మునిసిపాలిటీ పరిధిలోని నివాస భవనంలోని రెస్టారెంట్‌లో 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాలు, స్నాక్స్ తయారు చేస్తున్నారటంటూ సమాచారం అందుకున్నారు అధికారులు. వెంటనే ఆ రెస్టారెంట్‌పై దాడి చేసి వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. అరబిక్ దినపత్రిక ఓకాజ్ ప్రకారం వాష్ రూమ్‌లో స్వీట్లు, సమోసాలు, ఇతర స్నాక్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ తయారీ శాలలో అనేక కీటకాలు సంచరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలుకలు కూడా అక్కడ ఉండటం పరిస్థితికి అద్దంపడుతుంది.

Also read:

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్‌.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ

Harish Rao: బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయి తప్పా.. పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదుః హరీష్ రావు