ఓ మై గాడ్.. మరో రిఫ్రిజిరేటర్ ట్రక్కు కలకలం.. ఈ సారి 40 మంది…

ఇటీవల బ్రిటన్‌లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన  ఇంకా మరిచిపోకముందే.. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో శరణార్ధులంతా సజీవంగా బయటపడ్డారు. ఈ ఘటన గ్రీస్‌లో చోటుచేసుకుంది. నగరంలోని గ్జాంతి ప్రాంతంలో పోలీసులు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్న సమయంలో.. ఓ రిఫ్రిజిరేటర్ ట్రక్కును ఆపారు. అయితే అనుమానం తలెత్తడంతో.. ఆ ట్రక్కును పరీశిలించగా.. అందులో 40 […]

ఓ మై గాడ్.. మరో రిఫ్రిజిరేటర్ ట్రక్కు కలకలం.. ఈ సారి 40 మంది...
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 7:11 PM

ఇటీవల బ్రిటన్‌లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన  ఇంకా మరిచిపోకముందే.. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో శరణార్ధులంతా సజీవంగా బయటపడ్డారు. ఈ ఘటన గ్రీస్‌లో చోటుచేసుకుంది. నగరంలోని గ్జాంతి ప్రాంతంలో పోలీసులు రెగ్యులర్ చెకింగ్ చేస్తున్న సమయంలో.. ఓ రిఫ్రిజిరేటర్ ట్రక్కును ఆపారు. అయితే అనుమానం తలెత్తడంతో.. ఆ ట్రక్కును పరీశిలించగా.. అందులో 40 మంది స‌జీవంగా ఉన్న శ‌ర‌ణార్థుల‌ను గుర్తించారు. వెంటనే వారిని గ్రీస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఆఫ్టన్‌కు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఈ రిఫ్రీజిరేటర్‌ ట్రక్కులో సిస్టమ్ ఆన్ చేయకపోవడంతో.. అంతా సేఫ్‌గా బతికిపోయారు. అందులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.