భారత్ దెబ్బకు వణుకుతున్న ఉగ్రవాదులు.. రహస్య ప్రాంతాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌!

భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు కీలక ఉగ్రవాద నేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌ల విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. భారత దాడుల భయం, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వారిద్దరినీ రహస్యంగా వేర్వేరు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని ఉంచినట్లు తెలుస్తోంది.

భారత్ దెబ్బకు వణుకుతున్న ఉగ్రవాదులు.. రహస్య ప్రాంతాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌!
Hafiz Saeed And Masood Azhar

Updated on: Nov 15, 2026 | 9:06 AM

భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు కీలక ఉగ్రవాద నేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌ల విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. భారత దాడుల భయం, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వారిద్దరినీ రహస్యంగా వేర్వేరు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని ఉంచినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్‌ను లాహోర్‌లోని జోహర్ టౌన్ నుంచి రావల్పిండిలోని గారిసన్ గ్రౌండ్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉండటం గమనార్హం. మరోవైపు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో ఉన్న రహస్య నివాసానికి తరలించినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ మార్పుల వెనుక ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్ ప్రభావమేనని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులతో ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్న నేపథ్యంలో ఐఎస్ఐ అప్రమత్తమైనట్లు సమాచారం.

హఫీజ్ సయీద్ తన సంస్థ సభ్యులను నేరుగా కలవడం కూడా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆడియో సందేశాల ద్వారానే లష్కరే తోయిబా కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయన కదలికలపై ఆంక్షలు విధించడంతో పాటు భద్రతను మరింత పెంచినట్లు సమాచారం. పాకిస్థాన్ మాత్రం సయీద్ కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని చెబుతుండగా, అతను సురక్షిత నివాసంలో ఉన్నాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

మరోవైపు మసూద్ అజార్‌కు చెందిన జైషే మహమ్మద్ సంస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్‌లోని ఆ సంస్థ ప్రధాన స్థావరం మర్కజ్‌పై దాడులు జరగడంతో కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి సంస్థను తిరిగి బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అజార్ సైతం తన అనుచరులతో ప్రత్యక్ష సంబంధాలను తగ్గించుకుని, కొద్దిమంది కీలక కమాండర్లతో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఐక్యరాజ్యసమితి ఇప్పటికే హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించింది. 26/11 ముంబై ఉగ్రదాడులతో పాటు పలు దాడుల కేసుల్లో సయీద్ భారత్‌కు వాంటెడ్‌గా ఉన్నాడు. పుల్వామా, పఠాన్‌కోట్, పార్లమెంట్ దాడులతో సంబంధాలున్నట్లు అజార్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిద్దరినీ నిజంగానే కొత్త రహస్య స్థావరాలకు తరలించారా? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అనే విషయాలపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఈ పరిణామాలు నిజమైతే, పాకిస్థాన్‌లో ఉగ్రవాద నేతల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలకు ఇవి సంకేతాలుగా భావించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us