
ప్రధాని మోదీకి నైజీరియాలో ఘన స్వాగతం లభించింది. అలాగే ప్రధానిని ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్'(GCON)తో సత్కరించనుంది నైజీరియా. ఈ గౌరవాన్ని అందుకున్న రెండో విదేశీ సెలబ్రిటీగా ప్రధాని మోదీ నిలిచారు. 1969లో GCON అవార్డు పొందిన ఏకైక విదేశీ సెలబ్రిటీ క్వీన్ ఎలిజబెత్.
మరోవైపు ఒక దేశం ప్రధాని మోదీకి ప్రధానం చేస్తున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం నైజీరియా చేరుకున్నారు. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు..ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు నైజారియాలో స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ లావని నృత్యం ప్రదర్శించారు.
నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. రేపు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు మోదీ . జీ-20 దేశాధినేతలతో భేటీ కానున్నారు. ఎల్లుండి గయానాలో పర్యటించనున్నారు..ప్రధాని.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..