విషాన్ని తయారుచేస్తుంది.. అంతరించిపోయే దశలో స్లో లోరిస్!

ప్రపంచంలో కొన్ని జీవులు తమకంటూ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. 89 ఏళ్ల తర్వాత ‘బంగ్కా స్లో లోరిస్’ తాజాగా ఇండోనేషియా అడవిలో కనిపించింది. అంతరించిపోయిన జాతిగా భావించిన జీవి బతికే ఉందని తెలుసుకుని జంతు శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ జీవి ప్రత్యేకత ఏంటంటే.. ఇది విషాన్ని ఉత్పత్తి చేయగల ప్రపంచంలోని ఏకైక క్షీరదం!

విషాన్ని తయారుచేస్తుంది.. అంతరించిపోయే దశలో స్లో లోరిస్!
Missing For 89 Years Rare Venomous Primate Rediscovered In Indonesia

Updated on: Nov 05, 2026 | 8:54 PM

ప్రపంచంలో కొన్ని జీవులు తమకంటూ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. 89 ఏళ్ల తర్వాత ‘బంగ్కా స్లో లోరిస్’ తాజాగా ఇండోనేషియా అడవిలో కనిపించింది. అంతరించిపోయిన జాతిగా భావించిన జీవి బతికే ఉందని తెలుసుకుని జంతు శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ జీవి ప్రత్యేకత ఏంటంటే.. ఇది విషాన్ని ఉత్పత్తి చేయగల ప్రపంచంలోని ఏకైక క్షీరదం!

89 ఏళ్ల తర్వాత ఎలా బయటపడింది?

 

ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపంలో బంగ్కా స్లో లోరిస్‌ను చివరిసారిగా 1937లో శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు దీని జాడ తెలియలేదు. దీంతో ఈ జాతి అంతరించిపోయి ఉండొచ్చని భావించారు. 2015 నుంచి 2025 మధ్య కాలంలో 90కి పైగా స్లో లోరిస్‌లను స్థానికులు, పరిశోధకులు గుర్తించారు. అయితే అడవిలో ఉండాల్సిన జంతువులు ఇళ్లల్లోని పెరట్లో, రోడ్ల పక్కన, విద్యుత్ తీగలపై కనిపించి షాకిచ్చాయి.

 

విషాన్ని ఉత్పత్తి చేసే అరుదైన వానరం

 

 

 

 

బంగ్కా స్లో లోరిస్ పగలు చెట్లపై విశ్రాంతి తీసుకుంటూ, రాత్రుళ్ల ఆహారం కోసం వేటాడతాయి. పెద్ద కళ్లు దీని ప్రత్యేక ఆకర్షణ. ఈ  జీవి పొడవు  10 అంగుళాలు మాత్రమే.  వీటికి  ఉన్న అసాధారణ లక్షణం ఏంటంటే ఇది విషాన్ని ఉత్పత్తి చేయగలదు. చేతిపై ప్రత్యేక గ్రంథిని నాకడం ద్వారా విషాన్నిఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవం మనుషుల శరీరానికి తాకితే తీవ్ర అలర్జీ తో బాధపడతారు,  వైద్య పరిభాషలో ‘అనఫిలాక్టిక్ షాక్’కు గురవుతారు. అయితే ఈ విషాన్ని ఇతర జంతువుల దాడి నుంచి రక్షణగా మాత్రమే ఉపయోగిస్తుంది.

జంతువులకు చికిత్స..  అడవిలోకి 86 విడుదల

ఇటీవల అలొబి వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది గాయపడిన జంతువులకు చికిత్స అందించారు.  వీటిలో కొన్ని విద్యుత్ తీగలకు తగిలి గాయపడగా, మరికొన్ని ఇతర జంతువుల దాడికి గురయ్యాయి. మరొక స్లో లోరిస్‌పై కుక్క దాడి చేసినట్లు గుర్తించారు. చికిత్స తర్వాత వాటిని తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు. అరుదైన జీవుల సంరక్షణలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.

అంతరించిపోయే ప్రమాదంలో

దాదాపు 89 ఏళ్ల తర్వాత ఈ జీవి మళ్లీ కనిపించి ఆశ్చర్యపరిచినా.. దాని మనుగడకు ప్రమాదం పొంచి ఉందనీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (IUCN) వీటిని రెడ్ లిస్ట్‌లో చేర్చింది.  స్లో లోరిస్‌కు ‘క్రిటికల్లీ ఎండేంజర్డ్’ (తీవ్ర అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతి) హోదాను ఇచ్చింది.

బంగ్కా ద్వీపంలో అక్రమ టిన్ తవ్వకాలు, ఆయిల్ పామ్ తోటల కోసం అడవులను నరకడంతో ఈ జీవి సహజ ఆవాసాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 89 ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించి బంగ్కా స్లో లోరిస్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన జీవి భవిష్యత్తు మాత్రం దాని సహజ ఆవాసాలను మనం ఎంతవరకు కాపాడగలమనే దానిపైనే ఆధారపడి ఉందనీ అంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us