మేం చాలా సంయమనంతో ఉన్నాం: పాక్ మేజర్ జనరల్

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇంకా పాక్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో పాక్ ప్రధాని సహా ఆ దేశానికి చెందిన అధికారులు సమయం చిక్కినప్పుడల్లా భారత్‌పై విషాన్ని కక్కుతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాట్లాడుతూ.. భారత్ ఏదైనా దుస్సహాసానికి పాల్పడితే వారి చర్యలను తిప్పికొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని విషయాల్లోనూ తమ […]

మేం చాలా సంయమనంతో ఉన్నాం: పాక్ మేజర్ జనరల్
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 8:28 PM

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇంకా పాక్ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో పాక్ ప్రధాని సహా ఆ దేశానికి చెందిన అధికారులు సమయం చిక్కినప్పుడల్లా భారత్‌పై విషాన్ని కక్కుతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాట్లాడుతూ.. భారత్ ఏదైనా దుస్సహాసానికి పాల్పడితే వారి చర్యలను తిప్పికొట్టేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని విషయాల్లోనూ తమ దేశం ఎంతో సంయమనంతో, బాధ్యతతో వ్యవహరిస్తోందని.. కానీ భారత్ మాత్రం తమను ఎప్పుడూ బెదిరిస్తూ రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలను ప్రయోగించే విషయంతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్ విషయంతో ఏకతాటిపై నిలిచి, సోషల్ మీడియాలో అండగా నిలుస్తున్న వారికి గపూర్ కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో పాకిస్తాన్, చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది.ఈ క్రమంలో కశ్మీర్ విషయమై యూఎస్ భద్రతా మండలిలో రహస్య సమావేశం జరిగింది. అయితే యూఎస్ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే దేశాలు ఇది భారత్- పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయ వేదికగా పాక్‌కు మరోసారి చుక్కెదురైంది.