
ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ దేశాల అగ్రనేతలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన సరదా సంభాషణే ప్రధాన ఆకర్షణగా మారింది. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన హాస్యభరిత సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీ-7 సమావేశం సందర్భంగా నాయకులు గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరిన సమయంలో ప్రధాని మోదీ, జార్జియా మెలోని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా మెలోని మాట్లాడుతూ, “మిమ్మల్ని మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. అనంతరం సరదాగా “ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట” అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించగా, ఇద్దరి మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణ సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘మెలోడీ’ ట్రెండ్‌కు ఇదే మరోసారి ఊతమిచ్చింది. ప్రధాని మోదీ, జార్జియా మెలోని పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలోడీ’ అనే పదం గత మూడు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ ట్రెండ్ మొదటగా 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సు సందర్భంగా ప్రారంభమైంది. అప్పట్లో మెలోని, ప్రధాని మోదీతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “Good Friends at COP28 #Melodi” అని రాశారు. ఆ హ్యాష్‌ట్యాగ్ వెంటనే వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు దానిని ట్రెండ్‌గా మార్చారు.
‘మెలోడీ’ పేరుకు వచ్చిన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని, రోమ్ పర్యటనలో ప్రధాని మోదీ జార్జియా మెలోనికి ‘Melody’ టాఫీల ప్యాకెట్‌ను బహుమతిగా అందించారు. ఆ సందర్భంగా మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో కూడా భారీ స్పందన తెచ్చి పెట్టింది. “ప్రధానమంత్రి మోదీ మాకు చాలా రుచికరమైన క్యాండీ తీసుకొచ్చారు” అని మెలోని చెప్పగా, ఇద్దరు నాయకులు నవ్వుకున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
ప్రపంచ రాజకీయాల్లో కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న భారత్-ఇటలీ సంబంధాలకు ఈ స్నేహపూర్వక అనుబంధం కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతి అంతర్జాతీయ వేదికపై మోదీ-మెలోని కలిసినప్పుడల్లా ‘మెలోడీ’ ట్రెండ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా జీ-7 సదస్సులో జరిగిన ఈ సరదా సంభాషణతో ‘మెలోడీ’ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మోదీ-మెలోని సరదా మాటలు వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN
— Jash (@jeetcasm) June 16, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..