Iran-US, Israel Conflict: ఇరాన్‌లో ఉండొద్దు.. త్వరగా దేశం వీడండి: భారత్ కీలక ప్రకటన..

అమెరికా-ఇరాన్‌ వార్‌ ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్‌కి ఇవాళ కాళరాత్రే అంటూ హెచ్చరించిన ట్రంప్‌.. ఎవ్వరూ ఊహించనివిధంగా రెండు వారాలపాటు దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి స్మాల్‌ బ్రేక్‌ పడింది. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో రాత్రికి రాత్రే కీలక మలుపు తిరిగింది పశ్చిమాసియా వార్‌.

Iran-US, Israel Conflict: ఇరాన్‌లో ఉండొద్దు.. త్వరగా దేశం వీడండి: భారత్ కీలక ప్రకటన..
Iran Us, Israel Conflict

Updated on: Apr 08, 2026 | 12:06 PM

అమెరికా-ఇరాన్‌ వార్‌ ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్‌కి ఇవాళ కాళరాత్రే అంటూ హెచ్చరించిన ట్రంప్‌.. ఎవ్వరూ ఊహించనివిధంగా రెండు వారాలపాటు దాడులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి స్మాల్‌ బ్రేక్‌ పడింది. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో రాత్రికి రాత్రే కీలక మలుపు తిరిగింది పశ్చిమాసియా వార్‌. ఇరాన్‌కి గడువు పొడిగించాలన్న పాక్‌ ప్రధాని షెహబాజ్‌ విజ్ఞప్తితో రెండు వారాలపాటు కాల్పుల విరమణ ప్రకటించారు ట్రంప్‌. హర్మూజ్‌ను తెరవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఇరాన్‌కి మరోసారి గడువు పెంచారు ట్రంప్‌.. అయితే, తమ డిమాండ్లకు అమెరికా అంగీకరించడంతోనే రెండు వారాలపాటు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు ప్రకటించింది ఇరాన్‌. ఇరాన్‌ సాయుధ దళాల పర్యవేక్షణలోనే హర్మూజ్‌లో రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ క్రమంలో.. ఇరాన్ లో ఉన్న భారతీయులకు.. భారత ప్రభుత్వం భారత్ కీలక ప్రకటన చేసింది. త్వరగా అక్కడని నుంచి బయటపడాలని సూచనలు చేసింది.

యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు ఆ దేశం నుంచి త్వరగా వీడాలని భారతదేశం బుధవారం తాజాగా భారత ప్రభుత్వం ఒక సలహా జారీ చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం Xలో కీలక పోస్ట్‌ చేసింది. ఇరాన్‌లోని భారత పౌరులు.. తాము సూచించిన మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని కోరింది.

“రాయబార కార్యాలయంతో ముందస్తు సంప్రదింపులు, సమన్వయం లేకుండా ఏ అంతర్జాతీయ భూ సరిహద్దును సమీపించడానికి ప్రయత్నించకూడదు..” అని ఆ పోస్ట్‌లో పేర్కొంది. అంతేకానకుండా రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపు నంబర్లను కూడా విడుదల చేసింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359 నెంబర్లకు లేదా మెయిల్ ఐడి – cons.tehran@mea.gov.in ను సంప్రదించాలని.. సూచించింది.

అమెరికా, ఇరాన్‌లు రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ సలహా వెలువడింది.

ఇరాన్‌లోని భారత పౌరులు రాబోయే 48 గంటల పాటు ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని కోరుతూ రాయబార కార్యాలయం మంగళవారం సాయంత్రం ఒక సలహా జారీ చేసింది. భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు కచ్చితంగా దూరంగా ఉండాలని రాయబార కార్యాలయం కోరింది.

అధికారిక సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ లక్ష్యాలపై జరిపిన దాడులు, యుద్ధం ప్రారంభమైన తర్వాత.. విద్యార్థులతో సహా సుమారు 9,000 మంది భారతీయులు ఇరాన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,800 మంది భారతీయులు భారతదేశానికి తిరిగి వచ్చారు.

Follow Us