అరబ్ దేశాల్లో చిచ్చు పెట్టి ఖార్గ్ ఎటాక్.. పొరుగు దేశానికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధంలోకి అరబ్ దేశాలు ఇప్పుడు ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా, ఈ యుద్దంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాలను కోరుతున్నారు. ఇప్పుడు, ఈ సంఘర్షణ ఒక ప్రాంతీయ యుద్ధంగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

అరబ్ దేశాల్లో చిచ్చు పెట్టి ఖార్గ్ ఎటాక్.. పొరుగు దేశానికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Iran Warns Arab Nation

Updated on: Mar 26, 2026 | 10:52 AM

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధంలోకి అరబ్ దేశాలు ఇప్పుడు ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా, ఈ యుద్దంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాలను కోరుతున్నారు. ఇప్పుడు, ఈ సంఘర్షణ ఒక ప్రాంతీయ యుద్ధంగా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక అరబ్ దేశం అమెరికాతో కుమ్మక్కు అవుతూందని, తమకు నిఘా సమాచారం అందిందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకిర్ ఘాలిబాఫ్ పేర్కొన్నారు.

సోషల్ మీడియా X వేదికగా తన పోస్ట్‌లో, ఇరాన్ గూఢచార సంస్థ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పొరుగు దేశం సహాయంతో ఆ ద్వీపంపై దాడి జరుగుతుందని ఆయన తెలిపారు. ఒకవేళ ఆ పొరుగు దేశం అలా చేస్తే, దానిని నాశనం చేస్తామని ఘాలిబాఫ్ బెదిరించారు. ఇరాన్ ప్రకటనలో ఏ అరబ్ దేశం పేరును ప్రస్తావించనప్పటికీ, ఆ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయి ఉండవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. “కొన్ని నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఆ ప్రాంతంలోని ఒక దేశం మద్దతుతో ఇరాన్ శత్రువులు, ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. శత్రువుల కార్యకలాపాలన్నీ మా సాయుధ దళాల నిశిత నిఘాలో ఉన్నాయి. ఒకవేళ వారు మా సరిహద్దులు దాటితే, ఆ ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నీ ఎలాంటి అడ్డు లేకుండా దాడులకు దిగుతాము.” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖిర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు.

ఇదిలావుంటే, గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ ఎనిమిది అరబ్ దేశాలు ఇటీవల ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశాయి. ఖతార్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యలు తమ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమేనని, ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us