తగ్గిన కాల్పుల మోత.. మొదలైన కాసుల కోత.. హార్ముజ్‌ జలసంధి వద్ద కొత్త పంచాయతీ..!

మధ్యప్రాచ్యంలో కాల్పుల మోత తగ్గింది. కానీ కాసుల కోత మొదలైంది. హార్ముజ్‌ను ఓపెన్ చేస్తాం.. కానీ కండిషన్స్ అప్లై అంటోంది ఇరాన్. ఇన్నాళ్లూ టోల్‌ ఫ్రీగా ఉండే హార్ముజ్ జలసంధి.. ఇప్పుడు టోల్‌ఫీ జోన్‌లోకి చేర్చింది టెహ్రాన్. ఇందుకు సంబంధించిన బిల్లును ఇప్పటికే ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంటే ఇప్పటి నుంచి ఏ షిప్ అయినా హార్ముజ్‌ నుంచి బయటకు రావాలంటే టోల్ కట్టి బయటకు రావాలి.

తగ్గిన కాల్పుల మోత.. మొదలైన కాసుల కోత.. హార్ముజ్‌ జలసంధి వద్ద కొత్త పంచాయతీ..!
Strait Of Hormuz

Updated on: Apr 08, 2026 | 4:04 PM

మధ్యప్రాచ్యంలో కాల్పుల మోత తగ్గింది. కానీ కాసుల కోత మొదలైంది. హార్ముజ్‌ను ఓపెన్ చేస్తాం.. కానీ కండిషన్స్ అప్లై అంటోంది ఇరాన్. ఇన్నాళ్లూ టోల్‌ ఫ్రీగా ఉండే హార్ముజ్ జలసంధి.. ఇప్పుడు టోల్‌ఫీ జోన్‌లోకి చేర్చింది టెహ్రాన్. ఇందుకు సంబంధించిన బిల్లును ఇప్పటికే ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంటే ఇప్పటి నుంచి ఏ షిప్ అయినా హార్ముజ్‌ నుంచి బయటకు రావాలంటే టోల్ కట్టి బయటకు రావాలి. అయితే అంతర్జాతీయ జలాల ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి నుంచి రవాణా చేసే ఏ నౌకలైనా టోల్ ఫీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ యుద్ధం నేపధ్యంలో కొత్త రూల్‌ పెట్టింది ఇరాన్

రాత్రి బెదిరింపులు, తెల్లారాక దేబిరింపులు అన్నట్టుగా ఉంది అమెరికా తీరు. ప్రపంచ పటంలో ఇరాన్ ఉండదంటూ నిన్న రాత్రి గర్జించిన ట్రంప్..ఇప్పుడు శాంతి ఒప్పందం పేరుతో రెండు వారాలు సీజ్‌ పైర్ ప్రకటించారు. బాగానే ఉంది కానీ, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వైఫల్యానికి ఇప్పుడు ప్రపంచం మూల్యం చెల్లించుకోవాలా అంటూ అంతర్జాతీయ సమాజం ఆగ్రహిస్తోంది. అయితే ప్రపంచ దేశాల అభ్యంతరాలను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. టోల్ ఫీ ఎంతన్నది ఇంకా నిర్థారణ కాలేదు కానీ, ఫీ వసూలు చేసేందుకు మాత్రం సిద్ధమైంది. దేశ ఫ్లాగ్‌ను బట్టి, నౌక రకం, అది తీసుకెళ్తున్న సరుకు, ఓడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న దేశాన్ని బట్టి టోల్‌ ఫీ ఉండేలా చార్జ్‌ చార్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

యుద్ధ సమయంలో ఇరాన్ కొన్ని నౌకలపై సుంకాలు విధించింది. కానీ అవి ఏ దేశాలకు చెందినవో, వాటి సంఖ్య ఎంత, ఎంత మొత్తం వసూలు చేశారనేది స్పష్టంగా లేదు. కొన్ని కథనాల ప్రకారం ఈ సుంకం 10-15 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఇరాన్‌కు సుంకాలు విధించే హక్కు ఇస్తే, ఒక్కో నౌకపై సుంకం 2 మిలియన్ డాలర్లు ఉండవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, నౌక రకం, సరుకు, మరియు అప్పటి పరిస్థితులను బట్టి సుంకాలు మారవచ్చు. ఈ రుసుములు ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు, అంతర్జాతీయ సముద్ర రవాణా నిబంధనలలో శాశ్వత మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు.

ఇరాన్-ఇరాక్ జాయింట్ ఛాంబర్ ప్రకారం, హోర్ముజ్ జలసంధిపై సుంకాలు విధిస్తే, ఇరాన్ ఏటా 70-80 బిలియన్ డాలర్లు సంపాదించగలదు. ఈ మొత్తంలో ఒమన్ వాటా ఎంత అనేది ప్రస్తుతం తెలియదు. ఇతర అంచనాల ప్రకారం ఈ సుంకాలు సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు. సూయజ్ కాలువపై సుంకాల ద్వారా ఈజిప్ట్ నెలకు 700 నుండి 800 మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. ఇరాన్ కూడా అదే విధంగా ప్రయోజనం పొందుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, టోల్‌ ఫీజును అమెరికా, అరబ్‌ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ రూల్స్ ప్రకారం టోల్ వసూలు చేయడం ఇల్లీగల్ అంటుున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us