శిథిలాల నుంచి పెళ్లిదుస్తులను బయటకు లాగి .. సైరన్ల మోత మధ్య ఒక్కటైన జంట..

రష్యాతో జరుగుతున్న భీకర యుద్ధం వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన తమ పెళ్లి ఎట్టకేలకు జరగబోతుందన్న ఖుషీలో 33 ఏళ్ల ల్యూడ్‌మైలా రైజాక్ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుంది. తన ఎంబ్రాయిడరీ డ్రెస్ ను, కాబోయే భర్త , ఉక్రెయిన్ సైనికుడి సంప్రదాయ షర్టును నీట్‌గా ఐరన్ చేసి బెడ్‌రూమ్ డోర్‌కి తగిలించి ఎన్నో క్యూట్ డ్రీమ్స్‌తో హ్యాపీగా నిద్రపోయింది. కానీ ఆ రాత్రి పరిస్థితి మొత్తం తలకిందులైంది.

శిథిలాల నుంచి పెళ్లిదుస్తులను బయటకు లాగి .. సైరన్ల మోత మధ్య ఒక్కటైన జంట..
Ukrainian Couple Marries After Their House Bombed By Russia

Updated on: Sep 10, 2026 | 7:28 PM

 ఆ జంట గాఢ నిద్రలో ఉన్న టైమ్‌లో వారి అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న ఒక  గిడ్డంగి పై రష్యా బలగాలు మిస్సైల్ దాడి చేశాయి. ఆ భారీ పేలుడు ధాటికి ఎగిసిపడిన మంటల్లో వారి ఫ్లాట్ కొంత భాగం ధ్వంసమైంది. తర్వాతి రోజు జరగాల్సిన పెళ్లి జరుగుతుందా అనే టెన్షన్ క్రియేట్ అయింది.

శిథిలాల నుంచి వెడ్డింగ్ డ్రెస్ ను లాగి

పేలుడు దాటికి అపార్ట్ మెంట్ లోని కిటికీలు పగిలి గోడ విరిగిపడటంతో, వారి పెళ్లి దుస్తులు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయాయి.  ఇల్లు కూలినా సరే.. ఈసారి మాత్రం తమ పెళ్లి ఆపకూడదని ఇద్దరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరుసటి రోజు ఉదయం రష్యా మరో దాడికి తెగబడింది.  ఆ జంట శిథిలాల కింద పడి ఉన్న తమ వెడ్డింగ్ డ్రెస్సులను బయటకు తీశారు. స్కర్ట్‌కి అంటుకున్న పగిలిన గాజు పెంకులను, దుమ్మును దులిపేస్తూ ల్యూడ్‌మైలా రెడీ అయింది.  పరిస్థితి  డేంజరస్‌గా ఉన్నా, రష్యా వైపు నుంచి వరుస అటాక్స్ జరుగుతున్నా.. ఆ లవ్ బర్డ్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సైరన్లు, బాంబుల మోతలు చెవులను హోరెత్తిస్తున్నా లెక్కచేయకుండా రిజిస్ట్రీ ఆఫీస్‌కి వెళ్లి ఒక్కటయ్యారు. “మేం ప్రాణాలతో బతికి ఉన్నాం కాబట్టి, మా అసలు జీవితం ఇప్పుడే స్టార్ట్ అయింది!” అంటూ ఆ కపుల్ చూపించిన తెగింపు నెటిజన్ల చేత సెల్యూట్ చేయిస్తోంది. యుద్ధం ఎంత భయంకరంగా ఉన్నా, ట్రూ లవ్ ముందు అవన్నీ బలాదూర్ అని నిరూపించిన ఈ రియల్ స్టోరీ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది!

ఈ ఇద్దరి లవ్ స్టోరీ మూడేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్స్ ద్వారా స్టార్ట్ అయింది. ఇద్దరికీ అప్పటికే పెళ్లిళ్లయి పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. కాలంతో పాటు ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఫ్రంట్‌లైన్‌కి వెళ్లిన లియోనిడ్ కు  ఆమె పూర్తి సపోర్ట్‌గా నిలిచింది.

రాజధాని కీవ్ పై రష్యా ఇటీవల వరుస దాడులకు పాల్పడటంతో వీరి పెళ్లి వేడుక వాయిదా పడుతూ వచ్చింది.  ఏకంగా ఆరు రోజులు వరుసగా రిజిస్ట్రీ ఆఫీస్‌కి వెళ్లినా డాక్యుమెంట్లను సమర్పించడం కుదరలేదు. చివరకు పెళ్లి వేడుక పూర్తవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రేమను గెలిపించుకోవాలని ఆ జంట పడిన తపన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను కదిలిస్తోంది!

Loading...
Unable to load recommendations.
Follow Us