US – Sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..

|

Dec 05, 2021 | 6:23 AM

Condolence to Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

US - Sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..
Sirivennela
Follow us on

Condolence to Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కలం నుంచి జాలివారిన సాహిత్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు డల్లాస్ తెలుగువారు. సిరివెన్నెలతో తమకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ఆగిపోయిదనే వార్త అమెరికాలోని తెలుగువారిని కలచి వేసింది. ఈ నేపథ్యంలోనే.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమెరికా డల్లాస్‌లో తెలుగు సంఘాలు నివాళులర్పించాయి. తానా, నాటా, టాంటెక్స్‌, నాట్స్‌, ఆటా తదితర తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తెలుగు ఎన్నారైలు. సిరివెన్నెల సీతారామా శాస్త్రితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మన మధ్య లేకున్నా.. ఆయన అందించిన సాహిత్యం ఎప్పటికీ సజీవంగా మన ముందు కనిపిస్తూ ఉంటుందన్నారు తెలుగు ఎన్నారైలు. అమెరికాలోని పలు నగరాల్లో తెలుగు సంఘాలు నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ఇక్కడి తెలుగువారితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను తెలుగు ఎన్నారైలు స్మరించుకుని నివాళులర్పించారు.

Also read:

Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం