Dangerous Plant: చెట్లు.. ప్రగతి మెట్లు అనే.. పర్యావరణ పరిరక్షణ కోసం.. చెట్లు పెంపకాన్ని ఓ యజ్ఞంగా చేపట్టారు. ప్రకృతిలో అనేక రకాల చెట్లు, మొక్కలు కనిపిస్తాయి. తమ ఇళ్ల చుట్టూ పచ్చదనం కోసం చెట్లను పెంచుతారు. ఎందుకంటే మొక్కలు పర్యావరణానికి కూడా చాలా ముఖ్యమైనవి. చెట్లు, మొక్కలు ప్రకృతితో పాటు మనకు అనేక రకాలైన ప్రయోజనాలు ఇస్తాయి. అయితే కొన్ని చెట్లు నిజంగా ప్రమాదకరమైనవి. ప్రస్తుతం డేంజరస్ చెట్ల గురించి ఇటీవలి కాలంలో చర్చ జరుగుతోంది. తాజాగా ఓ చెట్టుని తాకడంతో పిల్లల పరిస్థితి క్రిటికల్ గా మారింది. చిన్నారి చర్మంపై బొబ్బలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. ఈ వింత సంఘటన గ్రేట్ బ్రిటన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ చిన్నారి బాలిక పాఠశాలలో ఆడుకుంటుండగా హాగ్‌వీడ్ చెట్టు కనిపించింది. అయితే చిన్నారి ఈ మొక్కను తాకడంతో.. బాలిక చర్మం కాలిపోయింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇదే విషయంపై పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. స్టూడెంట్ ఈ ప్రమాదకరమైన మొక్కను తాకడంతో చిన్నారి పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఇటు వంటి మొక్కలు.. మీ చుట్టుపక్కల కనిపిస్తే.. వెంటనే దానిని నిర్ములించండి.. లేదంటే మీ పిల్లలకు హాని కలిగించవచ్చు అంటూ ప్రకటన రిలీజ్ చేసింది స్కూల్ యాజమాన్యం.
ఈ మొక్క ఎందుకు ప్రమాదకరమైనది అంటే..:
మీడియా నివేదికల ప్రకారం.. ఈ మొక్కలు వేడి ప్రదేశాలలో చాలా త్వరగా పెరుగుతాయి. ముఖ్యంగా బ్రిటల్ లో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఉష్ణోగ్రత కారణంగా ఈ ప్రమాదకరమైన మొక్కలు వేగంగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో ఎక్కడబడితే అక్కడ ఈ మొక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ మొక్కను తాకి ఎక్కువ మంది ప్రజలు కాలిపోతున్నారు. ఈ మొక్కను హాగ్‌వీడ్ కిల్లర్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. అందుకనే చాలా మంది ఈ మొక్కను తాకాలని తహతహలాడతారు. అయితే ఈ మొక్కను తాకిన 48 గంటల్లోనే .. దుష్ప్రభావాలు శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి.
క్యారెట్ జాతికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం Heracleum mantegazzianum mantagazianum. 19వ శతాబ్దంలో యురేషియా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన ఈ మొక్క ఇప్పుడు ఆదేశంలో భయాందోళనలు సృష్టిస్తోంది. హాగ్‌వీడ్ మొక్క విషపూరితం కావడానికి కారణం దాని లోపల ఉన్న సున్నితమైన ఫ్యూరనోకౌమరిన్‌లు. ఇవి మొక్క ప్రమాదకరంగా మారేలా చేస్తాయి. ప్రపంచానికి ప్రమాదకరమైన మొక్కగా హాగ్‌వీడ్ నిలిచింది. ఈ మొక్క వల్ల కలుగుతున్న అనారోగ్యాన్ని నయం చేయడానికి తగిన ఔషధం ఇప్పటి వరకూ కనుగొనలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..