
రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలకు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. చమురు దిగుమతులపై ఇప్పటి వరకు అమలు చేస్తున్న ఆంక్షలు, తారిఫ్ల నుంచి ఈ రెండు దేశాలకు మినహాయింపు ఇస్తున్నట్టు తాజాగా అమెరికా స్పష్టం చేసింది. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ప్రకారం.. రష్యా చమురును భారీగా కొనుగోలు చేసే అగ్ర దేశాలపై అమెరికాలోకి వచ్చే వస్తువులపై 100 శాతం వరకు భారీ సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంది. కానీ తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్, చైనాలకు భారీ ఊరట లభించింది.
ట్రంప్ ఏం చెప్పాడు
శుక్రవారం సాయంత్రం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ స్పందిస్తూ.. గ్రహామ్ చట్టంలో పేర్కొన్న ఆంక్షలు, పరిమితులు, సుంకాల అమలుకు తాను మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్, చైనాలకు ఈ నినహాయింపులు ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని.. కాంగ్రెస్‌కు సర్టిఫికేషన్ సమర్పించినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.
భారత్‌కు చేకూరే ప్రయోజనం ఏమిటి?
ఈ నిర్ణయం వల్ల భారత్‌కు కలిగే లాభం ఏమిటంటే.. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. ఒకవేళ అమెరికా కానీ 100 శాతం టారిఫ్‌లు విధిస్తే భారతీయ ఎగుమతిదారులపై తీవ్రమైన ప్రభావం పడేది కానీ ఇప్పుడు ఆ ముప్పు లేనట్టే. అంతేకాకుండా భారత్‌కు ఎక్కువ మొత్తంలో ముడి చమురును సరఫరా చేస్తున్న దేశం రష్యా.. దీనిపై విధించిన ఆక్షలపై ప్రస్తుతం అమెరికా మినహాయింపుతో ఇవ్వడంతో ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షల భయం లేకుండా మాస్కో నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకోవచ్చు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో ఈ వార్త భారత్‌కు ఊరట కల్పించనుంది.
చైనా నుంచి తీవ్ర పోటీ
అయితే రాష్యా నుంచి చమురు కొనడంపై ఉన్న టారిఫ్‌లు తొలగిపోయినప్పటికీ.. రష్యా చమురు దిగుమతుల్లో భారత్, చైనాల మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అటు చైనాకు కూడా రష్యా దిగుమతులపై అంక్షల మినహాయింపు కల్పించింది అమెరికా. దీంతో రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్‌కు డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచానా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా.. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న చైనాకు ఇదో ప్లెస్ పాయింట్ అవుంది. దీంతో చైనా భారీ మొత్తంలో వెచ్చించి క్రూడాయిల్‌ను ముందే బుక్‌చేసుకునే ఛాన్స్ ఉంది. ఇలా చేస్తే భారత్‌కు వచ్చే దిగుమతులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.