Viral News: లక్ అంటే ఈ యువతిదే.. రాళ్లు అనుకుని డాలర్‌కు పర్స్ కొంటే వజ్రాలు అయ్యాయి.. ఎంతకు అమ్ముడైయిందంటే..

|

Apr 02, 2023 | 11:17 AM

చాండ్లర్ వెస్ట్‌ ఓ ప్రముఖ వార్త ప్రత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను ఈ పర్స్ ను కొన్న సమయంలో అది చాలా పాతదిగా కనిపించింది. అంతేకాదు అది చాలా చౌకగా దొరకడంతో వెంటనే కొనుగోలు చేసినట్లు చెప్పింది. ఇంటికి పర్స్ తీసుకుని వచ్చిన తర్వాత తన మనసులో ఉత్సుకత ఏర్పడింది.

Viral News: లక్ అంటే ఈ యువతిదే.. రాళ్లు అనుకుని డాలర్‌కు పర్స్ కొంటే వజ్రాలు అయ్యాయి.. ఎంతకు అమ్ముడైయిందంటే..
Chandler Lesesne
Follow us on

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు.. కొన్ని సార్లు రాయి అనుకుంటే అది రత్నం అవుతుంది. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. తాజా ఓ యువతి తనకు నచ్చిన పర్స్ ను డాలర్ తో కొనుగోలు చేసింది. ఆ పర్స్ రంగు రంగుల రాళ్లతో అందంగా ఉంది. అయితే ఆ పర్స్ కొనుగులు చేసిన సమయంలో మార్కెట్ లో దాని విలువ ఎంత ఉంటుందో అప్పుడు ఆ యువతి ఊహించలేదు. అయితే ఆ పర్స్ కు ఉన్న రాళ్లు.. మామూలు రాళ్లు కాదని విలువైన వజ్రాలని తెలిసి షాక్ తిండి.. అంతేకాదు లక్షాధికారిణి అయింది.

వాస్తవానికి వజ్రం అసలు విలువను వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది.. సామాన్యుడి చేతిలోకి వజ్రం వచ్చినా దానిని రాయిగా భావిస్తాడని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఒక డాలర్‌తో పర్స్ కొన్న 29 ఏళ్ల చాండ్లర్ వెస్ట్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. పర్స్ పై  కొన్ని మెరుస్తున్న రాళ్లను చూసిన చాండ్లర్ వెస్ట్‌ మొదట ఏ విషయం అర్ధం కాలేదు. అయితే ఆ పర్స్ మీద ఉన్న రాయి వజ్రమని తెలుసుకున్న ఆమె షాక్ తింది. ఆ తర్వాత పర్స్ ను వేలం వేసింది.

ఇదే విషయంపై చాండ్లర్ వెస్ట్‌ ఓ ప్రముఖ వార్త ప్రత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను ఈ పర్స్ ను కొన్న సమయంలో అది చాలా పాతదిగా కనిపించింది. అంతేకాదు అది చాలా చౌకగా దొరకడంతో వెంటనే కొనుగోలు చేసినట్లు చెప్పింది. ఇంటికి పర్స్ తీసుకుని వచ్చిన తర్వాత తన మనసులో ఉత్సుకత ఏర్పడింది. అంతేకాదు పర్సు చిత్రాన్ని ఫేస్బుక్ లో  పోస్ట్ చేసినట్లు చెప్పింది. పురాతన వస్తువుల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తులు.. ఆ పర్స్ గురించి చాండ్లర్ వెస్ట్‌ కు చెప్పారు. అంతేకాదు ఈ పర్స్  1920 సంవత్సరంలో తయారు చేసిన లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ కార్టియర్ పర్స్ అని చెప్పారు. అంతేకాదు.. ఆ పర్స్ మీద ఉన్న మెరిసే రాయికి చాలామంది ఆకర్షితులయ్యారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు ఆ పర్స్ ను నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీని తరువాత.. చాండ్లర్ తన పర్స్ ను  నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లింది. అయితే పర్స్ మీద ఉన్న మెరిసే రాళ్ళు నిజమైన వజ్రాలే అని అప్పుడు ఆమెకు తెలిసింది. అంతేకాదు వాటి విలువ మార్కెట్ లో  $ 4,000 కంటే ఎక్కువ ధర ఉంటాయని తెలిసింది. అనంతరం చాండ్లర్ తన పర్స్ ను వేలం వేయగా.. దాని ధర 9,450 డాలర్లు పలికింది. మన దేశ కరెన్సీలో దాదాపు రూ.7.8 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఒక డాలర్ కు కొన్న పర్స్ తో ఆమె లక్షాధికారిణి అయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..