న్యూయార్క్ సందర్శనకు వచ్చి.. 91వ అంతస్థు టవర్ ఎక్కేసింది!

World's Skinniest Skyscraper: సాధారణంగా ఎత్తైన భవనాలను కింద నుంచి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా 1,428 అడుగుల ఎత్తున్న ఆకాశహర్మ్యాన్ని బయటివైపు నుంచి ఎక్కితే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసం చేసింది ఓ 18 ఏళ్ల యువతి. అది కూడా న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన, ప్రపంచ ప్రఖ్యాత ఆకాశహర్మ్యాల్లో ఒకటైన స్టెయిన్‌వే టవర్‌ను ఎంచుకుంది. భవనం వెలుపలి భాగం నుంచి పైకి ఎక్కుతూ ఏకంగా 91వ అంతస్తు వరకు చేరుకుంది.

న్యూయార్క్ సందర్శనకు వచ్చి..  91వ అంతస్థు టవర్ ఎక్కేసింది!
18 Year Old Scales 1428 Foot Nyc Skyscraper Gives Bizarre Reason For Her Arrest

Updated on: Nov 22, 2026 | 6:36 PM

Steinway Tower: సాధారణంగా ఎత్తైన భవనాలను కింద నుంచి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా 1,428 అడుగుల ఎత్తున్న ఆకాశహర్మ్యాన్ని బయటివైపు నుంచి ఎక్కితే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ సాహసం చేసింది ఓ 18 ఏళ్ల యువతి. అది కూడా న్యూయార్క్‌లోని అత్యంత ఖరీదైన, ప్రపంచ ప్రఖ్యాత ఆకాశహర్మ్యాల్లో ఒకటైన స్టెయిన్‌వే టవర్‌ను ఎంచుకుంది. భవనం వెలుపలి భాగం నుంచి పైకి ఎక్కుతూ ఏకంగా 91వ అంతస్తు వరకు చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కిందకు తీసుకొచ్చారు. అరెస్ట్ చేసి కోర్టుకు కూడా తీసుకెళ్లారు. అయితే తనను ఎందుకు అరెస్ట్ చేశారో ఆమె చెప్పిన సమాధానం వింటే పోలీసులే కాదు.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన 18 ఏళ్ల వివియన్ వార్నాక్ న్యూయార్క్ నగరాన్ని చూడటానికి వచ్చింది. అక్కడి అందాలు, ఎత్తైన భవనాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో మాన్‌హట్టన్‌లోని స్టెయిన్‌వే టవర్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది నేరుగా భవనం పైకి ఎక్కాలని నిర్ణయించుకుంది. అయితే మెట్ల మార్గంలోనో, లిఫ్ట్‌లోనో కాదు ఏకంగా భవనం బయటివైపు నుంచి ఎక్కడం ప్రారంభించింది.

నవంబర్ 16న సాయంత్రం 5 గంటల సమయంలో భవనం వెలుపలి భాగంలో ఓ యువతి ఎక్కుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు.. సుమారు 91వ అంతస్తు దగ్గర ఆమెను గుర్తించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆమెను కిందకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఆమె ఆన్సర్ ఇదీ!

అసలు కథ ఇక్కడే మొదలైంది. వివియన్‌ భవనంలోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించినట్లు (Burglary) మొదట పోలీసులు అభియోగం నమోదు చేశారు. అయితే ప్రాసిక్యూటర్లు ఆ తర్వాత ఆ అభియోగాన్ని తగ్గించి, మూడో డిగ్రీ క్రిమినల్ ట్రెస్‌ పాస్ కింద కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ అనంతరం న్యూయార్క్ పోస్ట్‌ దినపత్రికతో మాట్లాడిన వివియన్ ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. తాను వారం రోజులుగా న్యూయార్క్‌లో ఉంటూ నగరాన్ని చుట్టేస్తున్నానని చెప్పింది. మరి అంత ఎత్తైన భవనంపైకి ఎందుకు ఎక్కావని అడిగితే, ‘అది ధనవంతులు నివసించే ఖరీదైన భవనం. అక్కడ ఏమీ జరగలేదు. కానీ పైనుంచి కనిపించే వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.

తను కేవలం రెండు అంతస్తుల మేర మాత్రమే ఎక్కానని, ఇంతలోనే పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్పింది. ఇక పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేశారన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం మరింత విచిత్రంగా ఉంది. ‘నేను చాలా కూల్‌గా ఉంటాను. స్వేచ్ఛగా జీవించే వ్యక్తిని. వాళ్లు నా స్వేచ్ఛా స్వభావాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే నన్ను అరెస్ట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి.

బిల్డింగ్ ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వివియన్ ఎక్కిన స్టెయిన్‌వే టవర్ మామూలు భవనం కాదు. న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ సమీపంలో ఉన్న ఈ ఆకాశహర్మ్యం 1,428 అడుగుల ఎత్తుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దీని ఎత్తు, వెడల్పు నిష్పత్తి 24:1. అంటే భవనం ఎత్తుతో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యాల్లో ఒకటిగా దీనికి పేరుంది.

గతంలో రష్యాకు చెందిన ఏంజెలా నికోలావ్, ఇవాన్ కుజ్నెత్సోవ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యాంటెన్నాపైకి ఎక్కి వార్తల్లో నిలిచారు. అక్కడ బ్యానర్ ప్రదర్శించడంతో పాటు పెళ్లి ప్రపోజల్ కోరిక నెరవేర్చుకున్నారు. వివియన్ చేసిన ఈ సాహసం ఇప్పుడు ఆమెను చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. కేసులో దోషిగా తేలితే గరిష్ఠంగా మూడు నెలలు జైలు శిక్ష పడుతుంది. తాను నగరం అందాలను ఆస్వాదించేందుకు భవనంపైకి ఎక్కానని ఆమె చెబుతోంది. కానీ అనుమతి లేకుండా ఇలాంటి ఎత్తైన భవనాలను ఎక్కడం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. సరదా కోసం చేసిన సాహసం చివరకు జైలు శిక్ష వరకు వెళ్లింది.

Loading...
Unable to load recommendations.
Follow Us