గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

చైనాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇమి సిటిలోని హెనాన్ ప్రాంతంలో ఉన్న ఓ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పేలుడు ధాటికి ప్లాంట్ వర్క్ షాపు మొత్తం నేలమట్టమైంది. సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరం వరకు పలు భవనాల కిటికీలు బద్ధలయ్యాయి. అయితే […]

గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 20, 2019 | 6:10 PM

చైనాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇమి సిటిలోని హెనాన్ ప్రాంతంలో ఉన్న ఓ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

పేలుడు ధాటికి ప్లాంట్ వర్క్ షాపు మొత్తం నేలమట్టమైంది. సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరం వరకు పలు భవనాల కిటికీలు బద్ధలయ్యాయి. అయితే పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.