కొండచరియలు విరిగిపడి మహిళా క్రికెటర్ దుర్మరణం

భారీ వర్షాలు మేఘాలయ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడతున్నాయి. తాజాగా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్‌ మృతి చెందింది.

కొండచరియలు విరిగిపడి మహిళా క్రికెటర్ దుర్మరణం
Follow us

|

Updated on: Sep 25, 2020 | 7:29 PM

భారీ వర్షాలు మేఘాలయ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడతున్నాయి. తాజాగా మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడగా ఓ మహిళా క్రికెటర్‌ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురి ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. మావ్నీ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ టోర్నమెంట్లలో మేఘాలయ తరఫున ప్రాతినిథ్యం వహించిన మహిళా క్రికెటర్ రజియా అహ్మద్ మృతదేహాన్ని శిథిలాల వెలికితీసినట్లు మావ్నీ ప్రాంతీయ అధిపతి బాహ్ బడ్ పేర్కొన్నారు. 2011-12 నుంచి మధ్య కాలం మేఘాలయ రాష్ట్రం తరుపున మహిళా క్రికెటర్ రజియా అహ్మద్ వివిధ టోర్నమెంట్లలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిందని మేఘాలయ క్రికెట్ పేర్కొంది. రజియా అహ్మద్ మృతి పట్ల ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తోపాటు సహచరులు, క్రీడా ప్రముఖలు సంతాపం తెలిపారు. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది.