ఖిలాడీ లేడీ.. స్కూల్ ప్రిన్సిపాల్సే టార్గెట్..!!

స్కూల్ ప్రిన్సిపల్స్ టార్గెట్‌గా ఓ కిలాడీ లేడీ మోసాలకు పాల్పడుతోంది. పేరు నేహా ఫాతిమా. బడా స్కూళ్లను ఎంపిక చేసుకుని.. ప్రిన్సిపల్స్ టార్గెట్‌గా లక్షల్లో డబ్బులు దోచుకుంది. నెలరోజుల్లో మొత్తం 15 మంది ప్రిన్సిపాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఫాతిమా.. ఉద్యోగం కోసం వెతుకుతూ సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకుంది. పెద్ద పెద్ద స్కూళ్లు తమ విద్యార్థుల ఘనతను చాటేందుకు వారి వివరాలను వెబ్‌ సైట్లలో పోస్టు చేస్తుంటాయి. […]

ఖిలాడీ లేడీ.. స్కూల్ ప్రిన్సిపాల్సే టార్గెట్..!!
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 9:24 AM

స్కూల్ ప్రిన్సిపల్స్ టార్గెట్‌గా ఓ కిలాడీ లేడీ మోసాలకు పాల్పడుతోంది. పేరు నేహా ఫాతిమా. బడా స్కూళ్లను ఎంపిక చేసుకుని.. ప్రిన్సిపల్స్ టార్గెట్‌గా లక్షల్లో డబ్బులు దోచుకుంది. నెలరోజుల్లో మొత్తం 15 మంది ప్రిన్సిపాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఫాతిమా.. ఉద్యోగం కోసం వెతుకుతూ సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకుంది. పెద్ద పెద్ద స్కూళ్లు తమ విద్యార్థుల ఘనతను చాటేందుకు వారి వివరాలను వెబ్‌ సైట్లలో పోస్టు చేస్తుంటాయి. దీన్ని ఆసరాగా తీసుకుని సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి విద్యార్థునులు, వాళ్ల తల్లిదండ్రుల ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకుని.. మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలతో జత చేస్తుంది. స్కూల్ ఫేస్ బుక్‌లో వాటిని పోస్టు చేసిన బ్లాక్ మెయిల్ చేస్తూ.. లక్షల్లో డిమాండ్ చేసేది. ఇంకేముంది ఇలా నెల రోజుల్లో 15 మంది ప్రిన్సిపళ్లను మోసం చేసింది. ప్రిన్సిపల్స్ తన డిమాండ్లకు అంగీకరించకపోతే.. విద్యార్థుల తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసేది. దీంతో ఓ ప్రిన్సిపల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నేహా భాగోతం బయటపడింది. ఐపీ అడ్రస్ సాయంతో నేహాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.