చెర్రీతో చేతుల కలిపినా.. ‘సైరా’పై ఎన్టీఆర్ సైలెంట్ ఎందుకో..?

Why Junior NTR Silent on Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy Film?, చెర్రీతో చేతుల కలిపినా.. ‘సైరా’పై ఎన్టీఆర్ సైలెంట్ ఎందుకో..?

మెగాస్టార్ చిరంజీవిగా.. ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 7వ రోజుకూడా బాక్సాఫీస్‌ వద్ద సైరా షేక్ చేస్తోంది. అలాగే.. ఈ సినిమాలో లెజెండ్రీ యాక్టర్స్ నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాను చూసిన వారంతా.. బొమ్మ హిట్‌ అని.. వాళ్ల వాళ్ల అభిప్రాయలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్‌లో చెర్రీ బెస్ట్ ఫ్రెండ్ అయిన.. మహేష్ కూడా ట్వీట్ చేసి కంగ్రాట్యులేట్ చేశాడు. అలాగే.. నాగ్ ఫ్యామిలీ కూడా.. సైరా టీంను మెచ్చుకున్నారు. అనుకోని విధంగా.. పొలిటికల్ లీడర్, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ కూడా సైరా సినిమా గురించి, చిరంజీవి నటన గురించి ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. కాగా.. టాలీవుడ్ టాప్‌ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా సైరా సినిమాపై, మెగాస్టార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.

Why Junior NTR Silent on Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy Film?, చెర్రీతో చేతుల కలిపినా.. ‘సైరా’పై ఎన్టీఆర్ సైలెంట్ ఎందుకో..?

అంతా బాగానే ఉంది కానీ.. చెర్రీకి మరో బెస్ట్ ఫెండ్ర్‌ అయినా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాపై ఎలాంటి స్పందన చేయలేదు. టాలీవుడ్‌లో.. ఎన్టీఆర్, చెర్రీ, మహేష్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికే వీరు పలు పార్టీల్లో కలసి సందడి కూడా చేశారు. కాగా.. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’లో కూడా ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. కానీ.. చెర్రీ ప్రొడ్యూసర్‌గా చేసిన ‘సైరా సినిమా’పై మాత్రం ఎన్టీఆర్‌ ఎలాంటి స్పందన చేయకపోవడంతో.. ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Why Junior NTR Silent on Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy Film?, చెర్రీతో చేతుల కలిపినా.. ‘సైరా’పై ఎన్టీఆర్ సైలెంట్ ఎందుకో..?

అయితే.. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండి.. చూడలేని కారణంగానే.. ‘సైరా’ సినిమాపై ఎలాంటి రెస్పాన్స్ కాలేదని.. అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం.. మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య గొడవల కారణంగానే విష్ చేయలేదని చెబుతున్నారు. అటు నందమూరి బాలక‌ృష్ణ కూడా సైరా సినిమాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. అయితే.. ఎన్టీఆర్‌ మాత్రం సోషల్‌మీడియాలో సైరా సినిమాపై స్పందించకపోయినా.. చెర్రీతో మాత్రం పర్సనల్‌గా టచ్‌లో ఉన్నాడని.. తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *