ప్రభుత్వం సిగ్గుపడాలి.. గల్లా జయదేవ్ కృషి అభినందనీయం..!

సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా గుర్తించి విడుదల చేయడానికి.. గల్ల జయదేవ్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.. మాజీ మంత్రి దేవినేని ఉమ. ముఖ్య మంత్రి, ఆ పార్టీ ఎంపీలు చేయలేని పని.. ముగ్గురు పార్లమెంట్ సభ్యులున్న.. చంద్రబాబు నాయకత్వంలో పోరాడి సాధించారన్నారు. ఇప్పటికైనా.. వీరిని చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు మీద కోపంతో.. అమరావతిలో పనిచేస్తోన్న దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను వెళ్లగొట్టారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సింగపూర్ కంపెనీల గురించి అసెంబ్లీలో.. హేళనగా […]

ప్రభుత్వం సిగ్గుపడాలి.. గల్లా జయదేవ్ కృషి అభినందనీయం..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 3:08 PM

సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా గుర్తించి విడుదల చేయడానికి.. గల్ల జయదేవ్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.. మాజీ మంత్రి దేవినేని ఉమ. ముఖ్య మంత్రి, ఆ పార్టీ ఎంపీలు చేయలేని పని.. ముగ్గురు పార్లమెంట్ సభ్యులున్న.. చంద్రబాబు నాయకత్వంలో పోరాడి సాధించారన్నారు. ఇప్పటికైనా.. వీరిని చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.

చంద్రబాబు మీద కోపంతో.. అమరావతిలో పనిచేస్తోన్న దేశీయ, అంతర్జాతీయ కంపెనీలను వెళ్లగొట్టారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సింగపూర్ కంపెనీల గురించి అసెంబ్లీలో.. హేళనగా మాట్లాడారని మండిపడ్డారు దేవినేని ఉమ. అసలు ఈ ఆరేళ్ల పరిపాలనలో.. జగన్ నోటి వెంట.. అమరావతి పేరే ఎత్తలేదని అన్నారు. కొడాలి నాని బూతుల మంత్రి అని.. 7వ తరగతి పాసైన బూతుల మంత్రి.. తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు గురించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని వ్యాఖ్యనించారు దేవినేని ఉమ.