శింబు ఇంట పెళ్లి సందడి..?

కోలీవుడ్ నటుడు శింబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. అదేంటి శింబు పెళ్లి చేసుకుంటున్నాడా..? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు..? పెళ్లెప్పుడు..? సినిమా కోసమా, నిజంగానా..? ఈ ప్రశ్నలన్నీ మీ మదిని తొలుస్తున్నాయా..! అయితే ఈ స్టోరీ చదివేయండి. ప్రముఖ నటుడు టి. రాజేందర్ తనయుడు, శింబు సోదరుడు కురలరసన్ పెళ్లికి సిద్ధమయ్యాడు. బాల నటుడిగా పరిచయం అయిన కురళరసన్.. శింబు, నయనతార నటించిన ఇదునమ్మ ఆళ్లు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు. ఓ ముస్లిం […]

శింబు ఇంట పెళ్లి సందడి..?
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 2:52 PM

కోలీవుడ్ నటుడు శింబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. అదేంటి శింబు పెళ్లి చేసుకుంటున్నాడా..? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు..? పెళ్లెప్పుడు..? సినిమా కోసమా, నిజంగానా..? ఈ ప్రశ్నలన్నీ మీ మదిని తొలుస్తున్నాయా..! అయితే ఈ స్టోరీ చదివేయండి.

ప్రముఖ నటుడు టి. రాజేందర్ తనయుడు, శింబు సోదరుడు కురలరసన్ పెళ్లికి సిద్ధమయ్యాడు. బాల నటుడిగా పరిచయం అయిన కురళరసన్.. శింబు, నయనతార నటించిన ఇదునమ్మ ఆళ్లు అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు. ఓ ముస్లిం యువతితో గత కొద్ది ప్రేమలో ఉన్న కురలరసన్ ఇటీవల మతం కూడా మారాడు. దీంతో యువతి వర్గాలు వివాహానికి ఓకే చెప్పేయడంతో ఇప్పుడు పెళ్లి పనుల్లో శింబు కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26న కురలరసన్ వివాహం జరగనున్నట్లు సమాచారం. దీనిపై టి. రాజేందర్ కుటుంబం త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.