Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 936181 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 319840 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 592032 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24309 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా వ్యాక్సిన్ పై నిమ్స్ లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్. నిన్న ఆరుగురి నుండి రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఐసీఎమ్ఆర్కు పంపిన నిమ్స్ వైద్యులు. రెండు రోజుల్లో నిమ్స్ కు రానున్న రిపోర్ట్స్. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారిపై కు వ్యాక్సిన్ మొదటి డోసు ప్రయోగించనున్న వైద్యులు. నిమ్స్ లో రెండు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ ప్రయోగం.
  • సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల. www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో ఫలితాలు . ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా రిజల్ట్స్‌ తెలుసుకునే అవకాశం. కరోనా నేపథ్యంలో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ.
  • కృష్ణా నది ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా ప్రకాశం బ్యారణ్ కి అధికంగా చేరుతున్న నీరును దిగువకు విడుదల. కృష్ణా నదీ, పరివాహక ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కీసర, మున్నేరు, వైర, కట్లేరు తదితర కృష్ణా నది ఎగువ నదీ పరీవాహక ప్రాంతాలలో పడిన అధిక వర్షాలు ప్రకాశం బ్యారేజ్ లోనికి వస్తున్న నీరు. ప్రకాశం బ్యారజ్ వద్ద 12 అడుగుల లెవెల్ మైంటైన్ చేస్తూ దిగువకు నీరు విడుదల. అప్రమత్తమైన రేవెన్యూ, పోలీసు, ముత్తు పశుసంవర్థక శాఖ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖల అప్రమత్తం.
  • తెలంగాణలో మళ్లీ మావోల అలజడి. అధికార పార్టీ ఎమ్మెల్యేల టార్గెట్‌ చేస్తూ మావోల యాక్షన్‌ ఫ్లాన్‌. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంపు. ఏజెన్సీ ప్రాంతాలలో ముందస్తు సమాచారం లేకుండా పర్యటించొద్దని ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచన.
  • విజయవాడ: Tv9తో సీపీ శ్రీనివాసులు. 400 మందికి పైగా రౌడిసషీటర్లను బెజవాడలో గుర్తించాం. 70 మంది రౌడిషీటర్ల నగరంలో యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించాం. రాత్రిపూట వారి కదలికలపై నిఘా పెట్టాం. నలుగురు రౌడిసీటర్లను నగర బహిష్కరణ చేశాం. నగర బహిష్కరణకు మరికొందరిని లిస్ట్ ఔట్ చేశాం.. రౌడిషీటర్లు గంజాయి , డ్రగ్స సేవిస్తున్నారు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి , డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

స్మిత్‌కు షాక్.. మళ్లీ టాప్‌లోకి కోహ్లీ

ICC test Rankings, స్మిత్‌కు షాక్.. మళ్లీ టాప్‌లోకి కోహ్లీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ.. 928 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇక ఈ లిస్ట్‌లో మొన్నటి వరకు టాప్‌లో ఉన్న స్మిత్.. ఈ మధ్యన పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి 923 పాయింట్లతో స్మిత్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ తరువాత స్థానంలో కేన్ విలియమ్స్ సన్, చటేశ్వర పుజారా, డేవిడ్ వార్నర్, అజింక్యా రహానేలు నిలిచారు. అలాగే ఈ ఏడాది ఆరంభంలో 110వ ర్యాంకులో ఉన్న మార్నస్ లబుషేన్.. వరుస శతకాలు కొట్టి.. తొలిసారి టాప్-10లోకి అడుగుపెట్టాడు.

ఇదిలా ఉంటే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మాత్రం పెద్దగా మార్పులు లేవు. ఆసీస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా ఐదో స్థానంలో, రవిచంద్రన్‌ అశ్విన్‌ 9వ స్థానంలో, మహ్మద్‌ షమీ టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్‌ హోల్డర్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఇక వరుస టెస్టు సిరీస్‌ విజయాలతో టీమిండియా 120 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతోంది.

Related Tags