Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఇది విరాట్ హెయిర్‌స్టైల్ గురూ! ఇక మనం కూడా ‘కోహ్లీ’లమే!

Virat Kohli Fan Chirag Khilare Wins Internet With Unique Hairstyle, ఇది విరాట్ హెయిర్‌స్టైల్ గురూ! ఇక మనం కూడా ‘కోహ్లీ’లమే!

క్రీడా ప్రముఖులలో ఒకరైన విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ సందర్భంగా, ఓ విరాట్ కోహ్లీ అభిమాని చిరాగ్ ఖిలారే తన ప్రత్యేకమైన హ్యారీకట్ తో షోను అలరించాడు. ఇది అతని తల వెనుక భాగంలో భారత కెప్టెన్ కోహ్లీ ముఖాన్ని పోలి ఉంటుంది. చిరాగ్ ఖిలారే తన ప్రత్యేకమైన హ్యారీకట్ చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “@imVkohli గుండె నుండి తల వరకు” అని ఖిలారే ఈ పోస్ట్‌కు శీర్షిక పెట్టారు.

“చాలా సంవత్సరాలుగా, నేను భారతదేశంలో విరాట్‌ ఆడే ప్రతి మ్యాచ్‌ హాజరవుతానని, అతను అండర్ -19 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుండి నేను అతనికి అభిమానిని” అని చిరాగ్ ఖిలారే పేర్కొన్నాడు.

హెయిర్ టాటూ పూర్తి చేయడానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుందని, విరాట్ అదే పద్ధతిలో కనిపించే ప్రతి మ్యాచ్ చూడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ఖిలారే చెప్పారు. అయితే ఇప్పటివరకు కెప్టెన్ కోహ్లీని కలవడానికి అవకాశం రాలేదని చెప్పాడు. “కోహ్లీని కలవడమే నా కల, నేను అతనిని ఎప్పుడు కలుస్తానో, నేను మొదట అతని పాదాలను తాకి, అతన్ని కౌగిలించుకుని, ఫోటో తీసుకుంటానని” ఖిలారే చెప్పారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తమ చివరి తొమ్మిది వికెట్లను కేవలం 121 పరుగులకే కోల్పోయినందున ఆతిథ్య జట్టు అనూహ్యంగా 255 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనికి సమాధానంగా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అజేయంగా సెంచరీలు సాధించి ఆసీస్ కు ఘన విజయాన్ని అందించారు.