ఏపీలో గ్రామవార్డు వాలంటర్ ఉద్యోగాల జాతర..!

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామవార్టు వాలంటరీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. 8 రోజుల్లోనే దాదాపు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇక 20 లక్షల మంది ఈ వెబ్‌సైట్‌ను చూశారని ఆర్జీజీఎస్ శాఖ తెలిపింది. కాగా.. ఇందులో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు అప్లై చేసుకోవచ్చని, అలాగే.. రిజెక్ట్ అయినప్పటికీ.. […]

ఏపీలో గ్రామవార్డు వాలంటర్ ఉద్యోగాల జాతర..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2019 | 4:25 PM

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామవార్టు వాలంటరీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. 8 రోజుల్లోనే దాదాపు 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఇక 20 లక్షల మంది ఈ వెబ్‌సైట్‌ను చూశారని ఆర్జీజీఎస్ శాఖ తెలిపింది. కాగా.. ఇందులో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు అప్లై చేసుకోవచ్చని, అలాగే.. రిజెక్ట్ అయినప్పటికీ.. వారు మళ్లీ అభ్యర్థన చేసుకోవాలని ఆర్జీజీఎస్ అధికారులు సూచించారు.

ఈ పథకానికి సంబంధించి జూన్ 22వ తేదీన నోటీఫికేషన్ విడుదల చేశారు. జులై 5వ తేదీ ఆఖరి గడువుగా పేర్కొన్నారు. దీనికి 10వ తరగతి లేదా ఇంటర్ క్వాలిఫికేషన్. దాదాపు 4 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా ఉపాధి పొందబోతున్నారు.