అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేదెవరు ?? లిచ్ మన్ 13 ‘ కీ ‘ ఫార్ములా ఏం చెప్పింది ??
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ప్రపంచమంతా ఇదే ప్రశ్న. అమెరికాలో అయితే ఈ పాయింట్ మీద హాట్ హాట్ డిస్కషన్లు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్న ట్రంప్.. రిపబ్లికన్ల తరపున బరిలో ఉన్నారు. ఉపాధ్యక్షురాలిగా అనుభవం ఉన్న కమలా హ్యారిస్ డెమొక్రాట్ల తరపున పోటీ చేస్తున్నారు.
మరి వీరిద్దరిలో నెగ్గేదెవరు? ఓడేదెవరు? దీనిపై పొలిటికల్ అనలిస్టులు, స్ట్రాటజిస్టులు, సామాన్యులు.. ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. దానికి కొంత సైంటిఫిక్ రీసెర్చ్ ను జత చేసి మరికొందరు భవిష్యవాణి చెబుతున్నారు. ఇదే క్రమంలో అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పేరున్న రాజకీయ శాస్త్రవేత్త.. అలన్ లిచ్ మన్.. ఫార్ములా బేస్ మీద అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరో తేల్చేశారు. దానికోసం ఆయన 13కీ ఫార్ములాను ఉపయోగించారు. ఇంతకీ ఈ 13కీ ఫార్ములా అంటే ఏమిటి? 40 ఏళ్లుగా ఈ ఫార్ములా ఎలా నిజమవుతోంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు అవకాశాల గురించి ఇది ఎలా అంచనా వేస్తోంది? అలన్ లిచ్ మన్ చెప్పిందే నిజమైతే.. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలు కమలా హ్యారిసే అవుతారు. కానీ కచ్చితంగా నిజమవుతుందా అంటే.. దానికి శాస్త్రీయ ప్రామాణికత ఏమీ లేదు. కాకపోతే గత 40 ఏళ్లుగా అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో లిచ్ మన్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందుకే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు డెమొక్రాట్లలో ఉత్సాహం నింపుతున్నాయి. రిపబ్లికన్లకు షాక్ కు గురిచేశాయి. నిజానికి.. 13కీ ఫార్ములాను తయారుచేయడానికి లిచ్ మన్ పెద్ద కసరత్తే చేశారు. దీని ప్రకారం గెలిచేదెవరో అంచనా వేశారు. ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా చేశారు?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: