Voters in Underwear: ఎన్నికల్లో అండర్ వేర్‌తో వచ్చి ఓటేసిన ఓటర్లు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
2007 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అలస్యానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ.. ఈసారి పోలింగ్‌లో మాత్రం ‘అండర్‌వేర్ ఓటింగ్’ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అందుకు కారణం మాత్రం వేడి వాతావరణం ఎంత మాత్రమూ కాదండోయ్..
2007 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అలస్యానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ.. ఈసారి పోలింగ్‌లో మాత్రం ‘అండర్‌వేర్ ఓటింగ్’ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అందుకు కారణం మాత్రం వేడి వాతావరణం ఎంత మాత్రమూ కాదండోయ్.. స్విమ్‌వేర్ బ్రాండ్ అయిన ‘బడ్జీ స్మగ్లర్’ ఇచ్చిన ఆఫర్‌కు ఎగబడిన జనం ఇలా అండర్‌వేర్లు ధరించి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. లో దుస్తులు ధరించి ఓటేసి.. దానిని సోషల్ మీడియాలో #స్మగ్లర్స్ డిసైడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేస్తే బ్రాండెడ్ స్విమ్‌వేర్‌ను ఉచితంగా ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ తెగ నచ్చడంతో పురుషులు, మహిళలు అండర్‌వేర్ ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు. పురుషులు అండర్‌వేర్‌తో రాగా, మహిళలు స్విమ్ సూట్ ధరించి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారంతా తమ ఫొటోలను షేర్ చేశారు. తమ ప్రకటనకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఊహించలేదని ‘బడ్జీ స్మగ్లర్స్’ ఆనందం వ్యక్తం చేసింది. వారందరికీ సోమవారం నుంచి బహుమతులు ఇస్తామని ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!