అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్షుడవుతాడు. అదే సమయంలో కమలా హారిస్ గెలిస్తే తొలిసారి ప్రధాని అవుతారు. డొనాల్డ్ ట్రంప్ నెబ్రాస్కాలో గత రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇక స్వింగ్ రాష్ట్రాలలో ఒకటైన పెన్సిల్వేనియాలో కమలా హారిస్ అంచనాల ప్రకారం విజయకేతనాన్ని ఎగురవేశారు. కమలా అబార్షన్ విధానం వల్ల ఇక్కడి ఓటర్లు ఆమెకు మద్దతిచ్చారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించింది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 270 మంది అవసరం.