ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ.. భారత్‌తో బంధం పెంచుకోవాలని సూచన

Updated on: Oct 10, 2025 | 6:07 PM

అమెరికా సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. భారత్‌తో సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలని, లేకుంటే భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ట్రంప్ విధించిన 50% సుంకాల వల్ల ఇరు దేశాలకు నష్టం వాటిల్లిందని, పన్నులు తగ్గించాలని సూచించారు. బలమైన భాగస్వామిని దూరం చేసుకోవద్దని కోరారు. అమెరికా సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు.

అమెరికా సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్‌కు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. భారత్‌తో సంబంధాలను తక్షణమే పునరుద్ధరించకపోతే అమెరికాకు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత్‌తో అమెరికా సంబంధాలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని, ఇది దేశానికి ప్రమాదకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50% సుంకంతో అమెరికా వినియోగదారులు, భారత ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయారని సెనేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌తో అమెరికాకు బలమైన సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వీటికి విఘాతం కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు. కీలక భాగస్వామిని దూరం చేసుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

శ్రీరాముడిని గుర్తు చేసిన దక్షిణాఫ్రికా క్రికెటర్.. విల్లు-బాణం ఫోజు పెట్టి సెంచరీ సెలబ్రేషన్

గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్‌ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత

Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు