Threat To India: భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. హెచ్చరించిన ఐక్యరాజ్య సమితి.. అది ఎలా ఉండబోతుంది అంటే..?

|

Jun 06, 2022 | 9:59 PM

కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మద్దతుతో ఆప్ఘనిస్తాన్‌లో ఉనికిని చాటుకుంటున్న...


కొంత కాలంగా బలహీనపడుతూ వస్తున్న ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మద్దతుతో ఆప్ఘనిస్తాన్‌లో ఉనికిని చాటుకుంటున్న అల్‌-ఖైదా సంస్థ తన పత్రిక ‘నవా-ఇ-అఫ్గాన్- జిహాద్’ పేరును ‘నవా-ఎ-గజ్వా-ఇ-హింద్’గా మార్చుకుంది. ఈ పరిణామంతో ఈ సంస్థ వ్యూహాలపై అనుమానాలు మొదలయ్యాయి. ఆప్ఘన్‌ నుంచి కశ్మీర్‌ వరకూ విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ పేరు మార్చారని ఇండియాను అలర్ట్‌ చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతామండలి. తాలిబన్ల సహకారంతో అల్‌ఖైదా దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని UNSC హెచ్చరించింది. 2015లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులకు ముమ్మరం చేయడంతో అల్‌-ఖైదా చాలా వరకూ బలహీనపడిపోయింది. అయితే గత ఏడాది అక్కడ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకోవడం కోవడం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అల్‌ఖైదా శిక్షణా కేంద్రాలు కూడా పెరిగాయి.. అల్ ఖైదా ప్రస్తుత చీఫ్‌ ఐమన్ ముహమ్మద్ రబీ అల్ జవహిరి అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు చెందిన 400 మంది ముష్కరులకు అల్‌-ఖైదాలో ఉన్నారని UNSC నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్‌లోని తన శిక్షణా శిబిరాలను పాకిస్తాన్‌కూ విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 06, 2022 09:59 PM