US Woman: అవ్వా.! ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే ఆర్టికల్ రాసి .. తన భర్తనే చంపేసిన రచయిత్రి..

|

Jun 03, 2022 | 9:18 AM

‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే ఆర్టికల్ రాసిన రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో జరిగింది. ఊహించని రీతిలో నాన్సీ తన భర్త డేనియల్ ను ..


‘మీ భర్తను చంపడం ఎలా?’ అనే ఆర్టికల్ రాసిన రచయిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా తన భర్తను కాల్చి చంపేసిన ఘటన అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో జరిగింది.ఊహించని రీతిలో నాన్సీ తన భర్త డేనియల్ ను వెనుక నుంచి కాల్చి చంపేసింది. నాన్సీ భర్త డేనియల్ ఓ షెఫ్‌. ఓరెగాన్ కలినరీ ఇన్ స్టిట్యూట్ లో కుకింగ్ పాఠాలు చెబుతుంటాడు. తన ఇన్ స్టిట్యూట్ లోనే ఓ కిచెన్ లో ఉండగా..నాన్సీకి ఏమైందో తెలీదుగానీ తుపాకీతో వెనుక నుంచి రెండు రౌండ్లు కాల్చింది. కుప్పకూలిపోయి అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.విచారణలో నాన్సి గతంలో భర్త డేనియల్ తో కలిసి ఓ గన్ షోకు వెళ్లిన సందర్భంగా glock పిస్టల్ ను కొన్నాడని చెప్పింది. కానీ పోలీసులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే… ఆ గ్లాక్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా..ఆ పిస్టల్ ను ఎవరూ ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు.

మరి..నాన్సీ డేనియల్ ను ఏ తుపాకీతో కాల్చిందని పోలీసులకు ఎన్నో అనుమానాలు వచ్చాయి. నాన్సిని ప్రశ్నించగా..మరో ఆసక్తికర సమాధానం చెప్పింది. ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ నుంచి పిస్టల్ పైన ఉండే స్లైడ్ ను, బ్యారెల్ ను కొనుగోలు చేసానని..తమ గ్లాక్ పిస్టల్ కున్న స్లైడ్, బ్యారెల్ విప్పి, తాను ఆన్ లైన్ లో కొన్న స్పేర్ పార్టులను ఆ తుపాకీకి అమర్చింది. పిస్టల్ తో పాటు వచ్చిన బుల్లెట్లు కాకుండా, వేరే బుల్లెట్లు ఉపయోగించానని..భర్తను కాల్చిన అనంతరం, ఆ స్పేర్ పార్టులను విప్పదీసి, మళ్లీ ఒరిజినల్ పార్టులు బిగించి, తుపాకీని సేమ్ ప్లేస్ లో పెట్టేశానని తెలిపింది.ఈ కారణంగానే, గ్లాక్ పిస్టల్ తో ఎలాంటి కాల్పులు జరగలేదని పోలీసులు భావించారు. కానీ విచారణలో నాన్సీ చెప్పింది విన్నాక వారికి మతిపోయింది. త్వరలోనే ఈ కిల్లర్ రచయిత్రికి శిక్ష ఖరారుకానుంది అని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 03, 2022 09:18 AM