బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
దక్షిణ కొరియాలో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు పబ్‌జీ గేమ్ సృష్టికర్త క్రాఫ్టన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు పిల్లలకు జన్మనిస్తే ఒక్కో బిడ్డకు సుమారు రూ.64 లక్షల ఆర్థిక సాయం, జీతంతో కూడిన సెలవులు, వర్క్ ఫ్రం హోం వంటి సదుపాయాలు ప్రకటించింది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటికే పలువురు ఉద్యోగులు దీనివల్ల లబ్ధి పొందారు.
దక్షిణ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన పెరుగుతోంది. దక్షిణ కొరియాలో జనాభాను పెంచేందుకు తమ వంతు ప్రయత్నంతో ముందుకొచ్చింది పబ్జీ గేమ్ తీసుకొచ్చిన క్రాఫ్టన్ కంపెనీ. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పిల్లలను కంటే బిడ్డకు 64 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చైల్డ్ కేర్ సపోర్ట్ విధానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా పిల్లలను కనే ఉద్యోగులకు పెయిడ్ లీవ్స్తో పాటు మరెన్నో ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఒక్క బిడ్డను కనండి.. 64 లక్షల రూపాయలు తీసుకోండి.. ఒక్క బిడ్డను కంటేనే 64 లక్షల రూపాయలు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఏంటి బాసూ ఇది మరీ టూమచ్ అంటారా.. టూమచ్.. త్రీ మచ్ ఏమీ లేదు. ఏదో ఆషామాషీగా.. కామెడీగా చెప్పలేదు. సీరియస్గానే చెప్పింది.. చెప్పినట్లు బిడ్డను కన్న ఫ్యామిలీకి 64 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇప్పటికే 46 మందికి.. ఒక్కొక్కరికీ 64 లక్షల రూపాయలు చెల్లించింది దక్షిణ కొరియా దేశం. ఈ భూమండలంపైనే అతి తక్కువ జననాల రేటు ఉన్న దేశం.. దక్షిణ కొరియా. ఒక ఏడాది కాలంలో మొత్తం జనాభా దాదాపు 0.1 శాతమే పెరిగింది. జనాభా సుమారు 5 కోట్లు దాటింది. జనాభా పెరుగుదల శాతంలో ఇది అత్యల్పం. అది కూడా ఈ దక్షిణ కొరియాలోని విదేశీయుల ఇళ్లలో పుట్టిన పిల్లల జనాభానే. సౌత్ కొరియాలో యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ పిల్లలను కనడం లేదు. పెళ్లి కాని వాళ్లు.. కాలేదని కూడా బాధపడకుండా ‘సోలో బతుకే సో బెటర్’ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఎందుకంటే.. అక్కడ పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. విద్య, వైద్యంతో పాటు ఆస్పత్రి ఖర్చు చాలా ఖరీదు. అందుకే దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకున్నా పిల్లలను అస్సలు కనడం లేదు. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లల్ని కనాలంటూ జంటలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అయినా కొత్త జంటలు పట్టించుకోవడం లేదు. దీనిపై పబ్ జీ గేమ్ సృష్టికర్త కంపెనీ క్రాఫ్టన్ నగదు బహుమతి ఐడియాతో ముందుకొచ్చింది. ఒక్క బిడ్డను కంటే చాలు 64 లక్షల రూపాయలు ఇస్తాం అని 2025 ఫిబ్రవరిలో ప్రకటించింది. దీంతో, 2026, జనవరి నుంచి ఏప్రిల్ మధ్య.. 46 మంది శిశువులకు జన్మనిచ్చారు కంపెనీ ఉద్యోగులు. వాళ్లకు 64 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా.. 2 నెలలు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది కంపెనీ. ఆ 2 నెలల తర్వాత అవసరాన్ని బట్టి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!
అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’
