Brazil man: మోకాళ్లతో తొక్కిపట్టి.. గ్యాస్‌తో ఊపిరాడకుండా చేసి.. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అక్కడ రిపీట్!.
బ్రెజిల్‌లో అమాయక నల్లజాతీయుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. మోకాళ్లతో తొక్కిపట్టి హింసించారు. బాష్పవాయువు ప్రయోగించి ఊపిరాడకుండా చేశారు. దీంతో బాధితుడు మరణించాడు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రెజిల్‌లో అమాయక నల్లజాతీయుడిపై పోలీసులు ప్రతాపం చూపారు. మోకాళ్లతో తొక్కిపట్టి హింసించారు. బాష్పవాయువు ప్రయోగించి ఊపిరాడకుండా చేశారు. దీంతో బాధితుడు మరణించాడు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో దీన్ని పోలుస్తున్నారు. బ్రెజిల్‌లో మృతిచెందిన వ్యక్తిని 38 ఏళ్ళ జెనివాల్డో డి శాంటోస్ గా గుర్తించారు. సెర్గిపె రాష్ట్రంలో ఇద్దరు పోలీసులు మంగళవారం శాంటోస్‌ను అరెస్టు చేసి హింసించారని, తర్వాత కారు డిక్కీలో పడేసి అతడిపై బాష్పవాయువును ప్రయోగించారని స్థానికులు తెలిపారు. వదిలేయండంటూ శాంటోస్ ప్రాధేయపడుతున్నా వారు పట్టించుకోలేదు. పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా శాంటోస్ మృతిచెందాడు. ఊపిరాడకపోవడం వల్లే బాధితుడు మరణించాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై బ్రెజిల్‌లో ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పోలీసులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. కాగా.. దురుసుగా ప్రవర్తించడంతో శాంటోస్‌ను పోలీసులు అరెస్టు చేశారని, అతణ్ని నియంత్రించాలన్న ఉద్దేశంతోనే బాష్పవాయువును ప్రయోగించారని అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!