కంటికి కనిపించని డ్రోన్.. అమెరికా ఇంజనీర్ల మ్యాజిక్!
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'ఫాంటమ్ ట్విస్ట్' పేరుతో వినూత్న డ్రోన్‌ను అభివృద్ధి చేశారు. గాల్లో అత్యంత వేగంగా తిరుగుతూ మోషన్ బ్లర్ ప్రభావంతో కంటికి కనిపించకుండా ప్రయాణించే ఈ ఏఐ ఆధారిత డ్రోన్, వన్యప్రాణుల పరిశీలన, సర్వేలు వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరతీయనుందని నిపుణులు చెబుతున్నారు.
గాల్లో అత్యంత వేగంగా తిరుగుతూ కంటికి కనిపించకుండా మాయమయ్యే వినూత్న డ్రోన్‌ను అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజనీర్లు ఆవిష్కరించారు. ‘ఫాంటమ్ ట్విస్ట్’ అని పిలిచే ఈ యూఏవీ మనుషుల దృష్టి పరిమితులను ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకుంది. సాధారణ డ్రోన్లు పరిసరాల్లో కలిసిపోయేలా రంగులు లేదా మెటీరియల్స్ వాడితే, ఇది గాల్లో సెకనుకు 25 సార్లు తన చుట్టూ తాను తిరుగుతూ మోషన్ బ్లర్ ప్రభావంతో కంటికి స్పష్టంగా కనిపించకుండా అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. ఈ డ్రోన్ ఆకారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో డిజైన్ చేశారు. లక్షలాది మోడళ్లను విశ్లేషించి ఎంపిక చేసిన ఈ డ్రోన్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. సాధారణ క్వాడ్‌కాప్టర్‌లతో పోలిస్తే ఇది కంటికి కనిపించే అవకాశం 10 రెట్లు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇందులో ఒకే మోటార్, ఒకే ప్రొపెల్లర్ ఉండగా.. ప్రొపెల్లర్‌కు వ్యతిరేక దిశలో డ్రోన్ బాడీ మొత్తం వేగంగా తిరుగుతుంది. సిడ్నీలో జరిగిన ‘రోబోటిక్స్: సైన్స్ అండ్ సిస్టమ్స్ 2026’ సదస్సులో ప్రదర్శించిన ఈ ఆవిష్కరణ.. జంతువులకు, మనుషులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వన్యప్రాణుల పర్యవేక్షణకు, ప్రాజెక్టుల సర్వేలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘాటెక్కిన వంటిల్లు..భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు
Viral Video: గడ్డికోస్తున్న గొర్రెలు.. ఎక్కడంటే ?
వైన్స్‌లోకి దూసుకొచ్చిన చిరుత.. క్షణాల్లో అక్కడి వ్యక్తిని..
రిటైర్మెంట్ పొదుపు కోసం ఏది బెస్ట్ ?? మీకు సరిపోయే పొదుపు పథకం ఏది?
Auto Driver Love: నెటిజన్లను కదిలిస్తున్న ఆటోడ్రైవర్ ప్రేమకథా చిత్రం!