MP attack Viral Video: వాయమ్మ పార్లమెంట్‌ లో ఇదేం పని..! మహిళా సభ్యురాలిపై ఎంపీ.. ట్రేండింగ్ వీడియో.

Updated on: Dec 12, 2022 | 9:30 AM

పార్లమెంట్‌ సాక్షిగా మహిళా సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో పార్లమెంటు సభ్యుడు చేయి చేసుకున్నాడు.


పార్లమెంట్‌ సాక్షిగా మహిళా సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో పార్లమెంటు సభ్యుడు చేయి చేసుకున్నాడు. విచరక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెనెగల్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమికి చెందిన బెన్నో బాక్‌ యకార్‌కు చెందిన మహిళా ఎంపీ అమి డైయే గ్నిబీని ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్‌ చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆగ్రహానికి గురైన గ్నిబీ కుర్చీతో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. మరో ప్రతిపక్ష ఎంపీ ఆమెను కాలితో తన్ని పడిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేశారు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మాకీ సాల్ మూడోసారి విజయం సాధించారు.. గ్నీబి వ్యతిరేకించడంతో పాటు ప్రతిపక్ష ఎంపీ సాంబ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు. దీంతో గ్నిబీ వద్దకు వచ్చిన సాంబ్‌ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 12, 2022 09:30 AM
Follow Us