భారత్-రష్యా మధ్య 7 కీలక ఒప్పందాలపై సంతకాలు వీడియో
భారత్, రష్యా మధ్య ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ శిఖరాగ్ర చర్చలు నిర్వహించారు. 2030 నాటికి $100 బిలియన్ల వాణిజ్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. అణు ఇంధనం, రక్షణ, అంతరిక్షం, వైద్య రంగాల్లో సహకారంతో ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
భారత్, రష్యా మధ్య ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. మొత్తం 19 ఒప్పందాలపై సంతకాలు జరగ్గా, వీటిలో ఏడు కీలకమైనవి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య $100 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. రష్యా భారత్‌కు చిరకాల మిత్రదేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో రెండు దేశాలూ సుదీర్ఘంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. అణు ఇంధన రంగంలో భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
