హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..

Updated on: Dec 12, 2025 | 6:57 PM

అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు షాక్! కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో భారత్‌లో అనేక వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పబ్లిక్‌గా ఉంచాలని యూఎస్ ఎంబసీ సూచించింది. రీషెడ్యూల్ అయినవారు కొత్త తేదీలకే హాజరు కావాలి.

అమెరికా వెళ్లాలనుకునే భారతీయ హెచ్‌-1బి వీసాదారులకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా.. భారత్‌లో అనేక వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ విధానం కారణంగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్‌లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈనేపథ్యంలోనే భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని ఇమెయిల్ అందిన దరఖాస్తుదారులకు.. కొత్త అపాయింట్‌మెంట్ తేదీ విషయంలో సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి దరఖాస్తుదారులకు కీలక సూచనలు జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్ తేదీ మార్చబడినట్లు మీకు ఈమెయిల్ వచ్చి ఉంటే, కొత్త తేదీలో మాత్రమే హాజరు కావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పాత తేదీలో ఇంటర్వ్యూ కోసం వస్తే, వారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని హెచ్చరించింది. అంతర్జాతీయి మీడియా కథనాల ప్రకారం డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు జరగాల్సిన అనేక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చి నెలలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రైవసీ సెట్టింగులను ‘పబ్లిక్’గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల‌ 15 నుంచి అధికారులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తిస్తారు. “ప్రతి వీసా మంజూరు ప్రక్రియ ఒక జాతీయ భద్రతా నిర్ణయం” అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..

కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన

Akhanda 2 Review: లాజిక్స్‌ లేవమ్మా.. అన్నీ గూస్‌ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ