Elon musk: వస్తే ఆఫీస్ కు రండి.. లేకపోతే ఉద్యోగం మానేయండి.. ఎంప్లాయ్స్‌కు వార్నింగ్.!
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా కూడా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య..
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా కూడా తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనూ ఉద్యోగులు ఆఫీస్ లకు వచ్చి పని చేయాల్సిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఆఫీస్ లకు రాలేకపోతే ఉద్యోగాలు మానేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి ఎలాన్ మస్క్ తన ఉద్యోగులకు పంపించిన మెయిల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రిమోట్ వర్క్ చేయాలనుకుంటే వారంలో కనీసం 40 గంటలు ఆఫీస్‌లో ఉండాల్సిందేనని మెయిల్ లో పేర్కొన్నారు. ఆఫీస్ అంటే ప్రధాన కార్యాలయమేనని, విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీలు కాదని తెలిపారు. సంస్థ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్ లీకై ఉండవచ్చని ట్విటర్‌లో ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు. మరోవైపు, టెస్లా ప్రధాన కార్యాలయం ఉన్న చైనా షాంఘైలో లాక్‌డౌన్ కొనసాగుతూ ఉండటం విశేషం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!