Elon Musk father: 35 ఏళ్ల పెంపుడు కుమార్తెతో.. రెండో బిడ్డను కన్న 76 ఏళ్ళ ఎలాన్ మస్క్ తండ్రి..!

|

Jul 19, 2022 | 9:58 AM

ఎలన్‌ మస్క్‌ తన కవల సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌కు


ఎలన్‌ మస్క్‌ తన కవల సంతానంపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తరిగిపోతున్న జనాభా సంక్షోభానికి తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఎలన్‌ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోనంటూ ఆయన తండ్రి ఎర్రోల్‌ మస్క్‌ సైతం ఈ తరహా వ్యాఖ‍్యలు చేయడం విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానాతో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. తాజాగా యూకేకి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు. తనకు చెల్లెలు వరుసయ్యే జానాతో తండ్రి పిల్లల్ని కనడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ తొలిసారి ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌రువాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి అప్ప‌టికే పెళ్లై 10 ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. కాగా.. జానాకు ఎలన్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40 ఏళ్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..