కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా షాకింగ్ సీన్.. భయంతో పరుగులు తీసిన జనం
న్యూయార్క్‌లోని అల్బానీ సిటీ కోర్టులో బొద్దింకలు రచ్చ చేశాయి. దాంతో కోర్టును తాత్కాలికంగా మూసేశారు. అక్కడి న్యాయాధికారులు, ఇతర అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..
న్యూయార్క్‌లోని అల్బానీ సిటీ కోర్టులో బొద్దింకలు రచ్చ చేశాయి. దాంతో కోర్టును తాత్కాలికంగా మూసేశారు. అక్కడి న్యాయాధికారులు, ఇతర అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర క్యాపిటల్ వద్ద నలుగురు వ్యక్తుల అరెస్ట్‌కు సంబంధించి అల్బానీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంతలో న్యాయస్థానంలో జరుగుతున్న వాదనలను ప్రతివాది వీడియో చిత్రీకరించడం ప్రారంభించారు. దాంతో ఆ వీడియో ఆపమని న్యాయస్థానం అధికారులకు సూచించారు. దాంతో వివాదం చెలరేగింది ఈ నేపథ్యంలో కొందరు ప్లాస్టిక్ కవర్లలో వందలాది బొద్దింకలను పట్టుకొచ్చి కోర్టులో వదిలారు. ఆ బొద్దింకలు కోర్టు హాల్ మొత్తం ఆక్రమించేయడంతో అందరూ భయపడిపోయారు. కోర్టు నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, కోర్టు హాల్‌లో తిష్ట వేసిన బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాల్సి ఉంటుందని, అప్పటి వరకు కోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది ఒక మహిళ అని నిర్ధారించుకున్నారు అధికారులు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, భౌతిక సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి ఆరోపణల కింద 34 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!