Corona virus: కరోనా వైరస్‌ చైనా సృష్టే.. వుహాన్ శాస్త్రవేత్త సంచలన ప్రకటన.. వీడియో.

Updated on: Jul 03, 2023 | 8:17 AM

కరోనా వైరస్‌ సహజంగా పుట్టింది కాదని, ఉద్దేశపూర్వకంగానే దానిని సృష్టించారని తేలిపోయింది. ఈ భయంకరమైన ఈ వైరస్‌ ఒక జీవాయుధమని, ఇది వుహాన్‌ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందని, చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసినదేనని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ పరిశోధకుడు చోవోషావ్‌ వెల్లడించారు.

కరోనా వైరస్‌ సహజంగా పుట్టింది కాదని, ఉద్దేశపూర్వకంగానే దానిని సృష్టించారని తేలిపోయింది. ఈ భయంకరమైన ఈ వైరస్‌ ఒక జీవాయుధమని, ఇది వుహాన్‌ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందని, చైనా ఉద్దేశపూర్వకంగా ప్రజలకు అంటించేందుకు తయారు చేసినదేనని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ పరిశోధకుడు చోవోషావ్‌ వెల్లడించారు. ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సభ్యురాలు జెన్నిఫర్‌ ఝెంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్‌లను ఇచ్చి అందులో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. 2019లో వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారని పేర్కొన్న షావో.. క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో వారి ఆరోగ్యం, అక్కడి పరిశుభ్రతను పరిశీలించేందుకు వారిని పంపినట్టు తర్వాత తెలిసిందన్నారు. కరోనా వైరస్‌ను షావో జీవాయుధంగా అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే దీనిని సృష్టించినట్టు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...