Benjamin Netanyahu: గాజాలో తొలిసారి నెతన్యాహు పర్యటన.! ఇజ్రాయెల్ సైన్యంలో స్ఫూర్తి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు .. సీనియర్ అధికారులను వెంట బెట్టుకుని ఆదివారం గాజాకు వచ్చారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో ఆయన సమావేశమయ్యారు. వారిలో స్ఫూర్తి నింపారు. లక్ష్యం నెరవేరేవరకూ పోరాటం సాగుతుందని తెలిపారు. కమాండర్లు, సైనికులు ఆయనకు పరిస్థితిని వివరించారు. తాము తమ వీరోచిత సైనికుల వల్ల గాజాలో ఉన్నామనీ తమ పౌరులను విడిపించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటామని అన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు .. సీనియర్ అధికారులను వెంట బెట్టుకుని ఆదివారం గాజాకు వచ్చారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులతో ఆయన సమావేశమయ్యారు. వారిలో స్ఫూర్తి నింపారు. లక్ష్యం నెరవేరేవరకూ పోరాటం సాగుతుందని తెలిపారు. కమాండర్లు, సైనికులు ఆయనకు పరిస్థితిని వివరించారు. తాము తమ వీరోచిత సైనికుల వల్ల గాజాలో ఉన్నామనీ తమ పౌరులను విడిపించుకునేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటామని అన్నారు. యుద్ధంలో తమకు 3 లక్ష్యాలున్నాయని అవి హమాస్‌ను అంతమొందించడం, తమ బందీలందరినీ విడిపించుకోవడం, భవిష్యత్తులో ఎప్పటికీ గాజా తమకు ప్రమాదకరంగా ఉండకుండా చూడటం అని చెప్పారు. ఇప్పుడు తమ లక్ష్యం విజయం సాధించేవరకూ పోరాడటమనీ తమని ఎవరూ ఆపలేరని అన్నారు.
బలగాలున్నాయి.. బలం ఉంది.. యుద్ధంలో లక్ష్యాలన్నీ సాధించగలం అని సైనికులతో నెతన్యాహు అన్నారు. ఒకవైపు కాల్పుల విరమణ కొనసాగుతుండగా మరోవైపు వెస్ట్ బ్యాంక్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి చూస్తే.. 24 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు 8 మంది పాలస్తీనీయులను కాల్చి చంపాయి. ఇజ్రాయెల్ దాడిలో ఉత్తర గాజా హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్-ఘాండర్ హతమయ్యాడు. అతడిని ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు హమాస్ ఆదివారం ప్రకటించింది. మరో వైపు యెమెన్‌కు సమీపంలోని ఎడెన్ తీరంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ ట్యాంకర్ నౌకపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేసి.. స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు స్వాధీనం చేసుకుందీ తెలియరాలేదు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ నేపథ్యంలో ఇటీవల హుతీ రెబల్స్ పలు నౌకలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. సిబ్బందిలో భారత్, జార్జియా, ఫిలిప్పీన్స్ దేశాలవారు ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.