ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం
ఫిలిప్పీన్స్‌ను 7.6 తీవ్రతతో భారీ భూకంపం వణికించింది. మిండనోవా ద్వీపంలో తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలోనే సంభవించిన మరో భారీ భూకంపం నుంచి కోలుకుంటున్న తరుణంలో ఈ తాజా ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఫిలిప్పీన్స్‌లోని దక్షిణ మిండనోవా ద్వీపంలో తెల్లవారుజామున 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ తీవ్రత నమోదైన వెంటనే, ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపానికి సంబంధించిన భయానక దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనేక మంది ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీయగా, ఒక ఆసుపత్రి నుంచి రోగులు, సిబ్బంది ప్రాణాలను కాపాడుకునేందుకు రోడ్లపైకి వచ్చారు. భూకంప తీవ్రతతో కొన్ని భవనాలు కొన్ని సెకన్ల పాటు కంపించి, దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు నేలమట్టమయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్
వైరల్ అవుతున్న మెగాస్టార్ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా
మాట మార్చిన మహేష్.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్
