Watch Video: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు.. చెట్టుకు కాసిన డబ్బులు.. !
Karnataka Election News: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ ఐటీ అధికారుల దాడుల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అధికారులు..
Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ ఐటీ అధికారుల దాడుల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అధికారులు.. చెట్టుకు కరెన్సీ కట్టల మూట వేలాడుతుండటాన్ని చూసి విస్తుపోయారు. మైసూర్‌లో సుబ్రహ్మణ్యరాయ్ అనే వ్యక్తి కోటిరూపాయలు కరెన్సీ మూటను చెట్టుకు కట్టారు. పుత్తూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల బరిలో ఉన్న అశోక్‌రాయ్‌కి ఇతను సోదరుడు. ఐటీ అధికారులు వస్తున్నారని తెలిసి సుబ్రహ్మణ్యరాయ్ ఇలా విచిత్ర ప్రయత్నం చేశారు. గుబురుగా ఉన్న ఓ చెట్టు పైన ఓ బ్యాగు వేలాడుతుండటాన్ని సోదాల్లో ఐటీ అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తాడు కిందకు లాగిన ఐటీ అధికారులు.. బ్యాగ్ లోపల కోటిరూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు.
కర్ణాటకలోకి 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంటోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయ నేతలు కర్ణాటకలో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.